విద్యార్థినులకు కరెంట్ షాక్ ఇచ్చిన ఎలక్ట్రీషియన్! ముగ్గురు విద్యార్థినులు..

  • Author Soma Sekhar Published - 11:13 AM, Sat - 15 July 23
  • Author Soma Sekhar Published - 11:13 AM, Sat - 15 July 23
విద్యార్థినులకు కరెంట్ షాక్ ఇచ్చిన ఎలక్ట్రీషియన్! ముగ్గురు విద్యార్థినులు..

నేటి సమాజంలో కొందరు ఆకతాయిలు చేసే పనులు.. ప్రాణాల మీదకే తెస్తుంటాయి. సరదాకి చేస్తున్నాము అని వారు అనుకున్నా.. ఆ పని ఇతరుల ప్రాణాలు హరించిన సంఘటనలు మనం ఎన్నో చూశాం. తాజాగా ఓ ఎలక్ట్రీషియన్ చేసిన పనికి ముగ్గురు విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో విద్యుత్ పనుల నిమిత్తం వచ్చిన ఎలక్ట్రీషియన్ విద్యార్థినిలకు కరెంట్ షాక్ ఇచ్చాడు. దాంతో వారు అస్వస్థతకు గురైయ్యారు. అయితే ఈ పని ఎందుకు చేశావు అని సదరు ఎలక్ట్రీషియన్ ను అడిగితే.. అతడు చెప్పిన సమాధానానికి అందరు ఆశ్చర్యపోయారు. ఈ వార్తకు సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..

పాఠశాలలో విద్యుత్ పనులు చేసేందుకు వచ్చిన ఓ ఎలక్ట్రీషియన్ చేసిన పనికి ముగ్గురు విద్యార్ధినిలు అస్వస్థతకు గురైయ్యారు. ఈ ఘటన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలో టీవీలు అమర్చేందుకు కంకిపాడుకు చెందిన ఓ ఎలక్ట్రీషియన్ వచ్చాడు. అతడి వెంట సూరిబాబు అనే వ్యక్తిని సహాయకుడిగా తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే సూరిబాబు 10వ తరగతి గదిలో పనిచేస్తూ.. విద్యార్ధినులతో సరదాగా మాటలు కలిపాడు. తర్వాత వారు కూర్చునే బెంచికి కరెంట్ తీగలను తాకించాడు. దాంతో వారికి కరెంట్ షాక్ కొట్టింది. ఇలా పలుమార్లు చేశాడు. కాగా.. కొద్దిసేపటి తర్వాత ఆ ముగ్గురు విద్యార్థినిలు ముఖం కడుక్కునేందుకు బయటకి వచ్చారు.

ఈ క్రమంలోనే ముగ్గురిలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై కింద పడిపోయింది. దాంతో విషయం తెలుసుకున్న ప్రధాన ఉపాధ్యాయురాలు ఓ ఆర్ఎంపీ వైద్యునితో వారికి చికిత్స అందించి, ఇంటికి పంపించింది. కాగా.. విద్యార్థినిలు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో.. మండల అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. దాంతో అధికారులు ప్రధాన ఉపాధ్యాయురాలిపై ఆగ్రహాం వ్యక్తం చేయగా.. ఈ ఘటనకు బాధ్యుడు అయిన సురిబాబును నిలదీయగా.. అతడు చెప్పిన సమాధానానికి అందరు ఆశ్చర్యపోయారు. సరదాగా ఈ పని చేశానని అతడు చెప్పడంతో అధికారులు సురిబాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఇదికూడా చదవండి: ఏపీ విద్యా సంస్కరణలకు అంతర్జాతీయంగా ప్రశంసలు! ఐరాసలో ‘నాడు-నేడు’ స్టాల్..

Show comments