ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం అనేక సంస్కరణ చేపట్టారు. అలానే పసి బిడ్డ నుంచి పండు ముసలి వారి వరకు అందరికి వివిధ పథకాల ద్వారా సీఎం జగన్ అండగా ఉన్నారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలను అభివృద్ధితో పాటు రైతుల కోసం కూడా జగన్ ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశ పెట్టింది. అలానే తమది రైతు ప్రభుత్వం అనింపించేలా రైతుల కోసం అనేక సంస్కరణలు చేపట్టారు. వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ.. వారికి అండగా ఉన్నారు. అలానే రైతులు పండించిన పంట ఉత్పత్తులకు అదనపు విలువ చేకూర్చడం ద్వార గిట్టుబాటు ధరను కల్పించడమే లక్ష్యంగా జగన్ సర్కార్ పెద్ద ఎత్తున ఆహార శుద్ధి పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమల ఏర్పాటు మంగళవారం ఉదయం వర్చుల్ విధానంలో సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. రూ.1,719 కోట్లతో తలపెట్టిన 11 ఆహార శుద్ధి పరిశ్రమలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు.. ఆరు యూనిట్లకు ప్రారంభోత్సవం , ఐదు యూనిట్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..” ఆర్బీకేల ద్వారా రైతుల ఉత్పత్తులు కొనుగోలు చేశాము. కేంద్ర ప్రభుత్వం ఇవ్వని పంటలకు కూడా కనీస మద్దతు ధర ఇస్తున్నాము. ప్రతి ఏడాది ధరల స్థిరీకరణ నిధి ద్వారా రూ.3వేల కోట్లు కేటాయిస్తున్నామని ధర్మవరంలో వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చేస్తున్నాము.
దేశంలో ఎక్కడ లేని విధంగా మిల్లెట్స్ కు కనీస మద్దతు ధర అందించాం. మిల్లెట్స్ లో 13 సెకండరీ శుద్ధి కర్మాగారాలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి” అని సీఎం తెలిపారు. ఏటా 3.14 లక్షల టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ల ద్వారా 925 మందికి ప్రత్యక్షంగా ఉపాధి కలుగుతుంతడగా.. దాదాపు 40 వేల మందికి రైతులకు మేలు జరగనుంది. ఈ పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల కోసం అవసరమైన ముడి సరకును రైతుల నుంచి సేకరిస్తారు. ఈ సమయంలో ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధరకు మించి కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. సీఎం ప్రారంభించిన వాటిల్లో నాలుగు టమాటా విలువ ఆధారిత యూనిట్లు, ఒక మిల్లెట్స్ ప్రాసెసింగ్ యూనిట్, ఉల్లి ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలు ఉన్నాయి.
మరోవైపు రూ.1,692 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఐదు ఆహారశుద్ధి పరిశ్రమలకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఈ ఐదిటిలో చాకెట్ల కంపెనీ, వేరుశనగ ప్రాసెసింగ్ యూనిట్, మూడు టమాటా ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. వీటి ద్వారా 745 మందికి ఉపాధి లభించనుంది. అలానే 36,588 మంది రైతులకు లాభం చేకూరనుంది. మరి.. 11 ఆహార శుద్ధి పరిశ్రమలకు సీఎం జగన్ శ్రీకారం చుట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: అనారోగ్యతో బాధపడుతున్న వారికి సీఎం జగన్ భరోసా!