YS జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. అనంతపురంలో 4వ రోజు హైలెట్స్!

Memantha Siddham Day 4: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. ఈ బస్సు యాత్ర శనివారం నాలుగో రోజు కర్నూలు, అనంతపురం జిల్లాలో కొనసాగింది.

Memantha Siddham Day 4: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సంగతి తెలిసింది. ఈ బస్సు యాత్ర శనివారం నాలుగో రోజు కర్నూలు, అనంతపురం జిల్లాలో కొనసాగింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ‘సిద్ధం’ పేరుతో ప్రజల్లోకి వెళ్లిన సీఎం జగన్.. మరోసారి ‘మేమంతా సిద్ధం’ పేరుతో  ప్రజల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. మేమంతా సిద్ధం పేరుతో బస్సుయాత్ర ఈ నెల 27న ఇడుపులపాయ నుంచి  ప్రారంభమైంది. ప్రస్తుతం  మేమంత సిద్ధం బస్సు యాత్ర నాలుగోవ రోజు అనంతపురం జిల్లాలో కోనసాగుతోంది.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  మేమంతా సిద్ధం పేరుతో ప్రజల్లోకి వెళ్తు్న్నారు. ఈబస్సు యాత్ర శనివారం నాలుగో రోజుకు చేరుకుంది. శనివారం పత్తికొండ నుంచి ప్రారంభమైన ఈ బస్సుయాత్ర  గుత్తికి చేరింది. తుగ్గలి,  జొన్నగిరి, గుత్తి, పామిడి, కల్లూరు, అనంతపురం బైపాస్ , రాప్తాడు బైపాస్, ఆకుతోటపల్లి, సంజీవుపురం వరకు ఈ యాత్ర సాగింది. ఇక సీఎం జగన్ తలపెట్టిన ఈ బస్సు యాత్రకు జనాలు బ్రహ్మరథం పట్టారు. సీఎం జగన్ ప్రయాణిస్తున్న ప్రచార రథంపై పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇక మేమంతా సిద్ధంలో భాగంగా తుగ్గలిలో ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. వారితో  వైసీపీ ప్రభుత్వ పాలలో ప్రజలకు చేకూరిన లబ్ధి గురించి తెలియజేశారు. అలానే ప్రజల నుంచి సలహాలు సూచనలు సీఎం జగన్ స్వీకరించారు. సీఎం జగన్ కు ప్రజలు పలు వినతలు చేశారు. ఇక తుగ్గలిలో ముఖాముఖి ముగియడంతో మళ్లీ మేమంతా సిద్ధం యాత్ర తిరిగి ప్రారంభమైంది.

ఇక రతన ప్రాంతంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రచార రథం దిగి మార్గం మధ్యలో ప్రజల్ని కలుసుకున్నారు. పత్తికొండ స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ ను వైస్సార్ సీపీ నేతలు కలిశారు.  పలువురు పార్టీ నేతలను, సీనియర్ కార్యకర్తలను పేరుపేరునా పలకరిస్తూ వారియోగక్షేమాలను సీఎం జగన్ తెలుసుకున్నారు. అలా పలు ప్రాంతాలను దాటుకుంటూ బస్సుయాత్ర గుత్తిని చేరుకుంది. పట్టణంలోని గాంధీ సర్కిల్ లో జనసునామీ  కనిపించింది. ఇక సీఎం జగన్  కి గుంతకల్లు నియోజవర్గం బసినేపల్లిలో సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు. మొత్తంగా నాలుగో రోజు మేమంత సిద్ధం బస్సుయాత్ర  అనంతపురం జిల్లాకు చేరుకుంది. శనివారం రాత్రికి సంజీవపురంలో బస చేయనున్నారు. ఇక సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. మన గ్రామంలో వ్యవసాయం మారింది, వైద్యం మారింది, స్కూళ్లు మారాయి గతానికి భిన్నంగా అన్నీ మారుతున్నాయని ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు. అలానే పేదోళ్ల బతుకులు మారాలంటే.. జరుగుతున్న ఈ మార్పులు కొనసాగడం అవసరమని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Show comments