ప్రజలకు ఉచిత వైద్యం అందిచండమే ప్రభుత్వం ఉద్దేశం: CM జగన్

ప్రజలకు ఉచిత వైద్యం అందిచండమే ప్రభుత్వం ఉద్దేశం: CM జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైద్యరంగంలో అనేక సంస్కరణలు ప్రవేశ పెట్టారు. ముఖ్యంగా పేద వారికి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారు. ఇప్పటికే వైద్య రంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. తాను అధికారం చేపట్టిన తొలినాళ్లలోని ఆరోగ్య శ్రీ కింద అందించే సేవల సంఖ్యను పెంచేశారు. అంతేకాక పలు వైద్య కళాశాలకు శంకుస్థాపన చేశారు. పేద వారు వైద్యం కోసం ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్ ఉన్నారు. తాజాగా ఆరోగ్యసురక్షపై  సీఎం జగన్ బుధవారం సమీక్ష సమావేశం చేపట్టారు. ఈ సందర్భగా ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా? అనే బ్రోచర్ ని విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న సురక్ష తరహాలోనే ఈ ఆరోగ్య సురక్షని కూడా చేపట్టాలని  అన్నారు. సురక్ష తరహాలోనే ప్రతి ఇంటికి వెళ్లి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని తెలిపారు. ఒక నిర్ణీత రోజున వారికి మంచి జరిగేలా హెల్త్ క్యాంపు నిర్వహించాలని ఆదేశించారు. సురక్ష ద్వారా ప్రతి ఇంట్లో జల్లెడ పట్టి.. ఆరోగ్య సమస్యలను తెలుసుకోవాలని సీఎం జగన్ అన్నారు. అంతేకాక పరిష్కారమిచ్చే గొప్ప బాధ్యతను మనం తీసుకుంటున్నామన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా  గ్రామంలో ప్రతి ఇంటిని కవర్ చేయాలి. క్రానిక్ పేషెంట్ల ఉన్న ఇళ్లను మరింత ప్రత్యేక శ్రద్ధతో వారిని చేయి పట్టుకుని నడిపించాలి. ఈ కార్యక్రమంలో గర్బిణీలు, బాలింతలతో పాటు రక్తహీనత ఉన్నవాళ్లను కూడా గుర్తించాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు, నియోనేటల్ కేసులతో పాటు బీపీ, షుగర్ వంటి వాటితో బాధ పడుతున్నవారికి కూడా చికిత్స అందించాలి” అని సీఎం జగన్ అన్నారు.

ప్రతి మండలంలో నెలకు 4 గ్రామాల్లో ఈ ఆరోగ్య క్యాంపులు నిర్వహించాలని, దీనివల్ల ప్రతి 6 నెలకొకమారు ఆ మండలంలో ఉన్న ప్రతి గ్రామంలోనూ హెల్త్ క్యాంపు నిర్వహించినట్లవుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. సెప్టెంబరు 30న కార్యక్రమం ప్రారంభమవుతుందని, రూ.1 ఖర్చు కూడా లేకుండా ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రభుత్వ ఉద్దేశ్యమని సీఎం స్పష్టం చేశారు. మరి.. ప్రజల ఆరోగ్యం విషయంలో సీఎం జగన్ తీసుకుంటున్న ఈ విప్లవాత్మక నిర్ణయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments