వీడియో: ‘ఆడుదాం ఆంధ్ర’.. ఇంటర్నేషనల్ ప్లేయర్ లా ఈ కుర్రాడి ఆట!

Aadudam Andhra: వినూత్నమైన పథకాలు, పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్రీడారంగంలోనూ తన దైన ముద్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడల పండుగకు రూపకల్పన చేసి యువతకు క్రీడా రంగంలో సరికొత్త అవ కాశాలు అందించారు.

Aadudam Andhra: వినూత్నమైన పథకాలు, పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి క్రీడారంగంలోనూ తన దైన ముద్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడల పండుగకు రూపకల్పన చేసి యువతకు క్రీడా రంగంలో సరికొత్త అవ కాశాలు అందించారు.

నేటి ప్రపంచంలో యువత, విద్యార్థులు చదువు, ర్యాంకులు, ఉద్యోగం అంటూ యంత్రంలా పని చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులు విషయంలో వారి తల్లిదండ్రులు, సమాజం చాలా దారుణంగా ఉంది. కేవలం చదువులే విద్యార్థులకు ముఖ్యం అన్నట్లు భావిస్తున్నారు. వారిలోని ఇతర నైపుణ్యాలను గుర్తించే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఈ క్రమంలోనే ఎంతో మంది విద్యార్థులు క్రీడా రంగంపై  తమకున్న ఆశాలను చంపుకుని జీవిస్తున్నారు.  తమకు సరైన ఫ్లాట్ ఫామ్ దొరికితే ప్రతిభను చూపించేందుకు విద్యార్థులు, యువత సిద్ధంగా ఉన్నారు. అలాంటి సరైన ఫ్లాట్ ఫామ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యువతకు అందించారు. విద్యార్థుల కోసం ప్రత్యేక క్రీడా కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం దేశంలో ఇదే ప్రథమం.

ఏపీ ముఖ్యమంత్రి వినూత్నమైన పథకాలూ, పాలనతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఇప్పటికే విద్యా, వైద్య రంగలో తనదైన ముద్రను సీఎం జగన్ వేశారు. అలానే క్రీడా రంగంలో కూడా తనదైన ముద్రకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో క్రీడల పండుగకు రూపకల్పన చేశారు. దీని ద్వారా విద్యార్థులకు, యువతకు క్రీడా రంగంలో సరికొత్త అవకాశాలు అందించారు. ఇక ఫ్లాట్ ఫామ్ ద్వారా ఎంతో మంది విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందారు.

తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆడుదాం ఆంధ్రా  క్రీడా పోటీల్లో భాగంగా ఓ విద్యార్థి ఖోఖో  ఆటలో అందరిని ఆకట్టుకున్నాడు. చిరుత వేగంతో గాల్లోకి దూకుతూ ప్రత్యర్థి ఆటగాడిని అవుట్ చేశాడు. ఈ వీడియో చూసిన అందరూ వేటతో ఉన్న చిరుత పంజా విసిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ఇలాంటి ఎంతో మంది యువత..తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది విద్యార్థుల నైపుణ్యం బయటకు వచ్చిందనడానికి ఈ విద్యార్థి వీడియో ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.

ఈ యువకుడిలా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి వెలుగులోకి వచ్చారు. ఇప్పటికే చాలా మందికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించింది. అంతేకాక క్రీడల వల్ల మానసిక వికాసం, శారీరక దారుఢ్యంతో పాటు బృంద స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకున్నారు. అలానే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల క్రీడాకారులతో స్నేహ సౌభ్రాతృత్వాలు పెంచుకున్నారు. ఇది అంతా సీఎం జగన్ ప్రారంభించిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం కారణంగానే సాధ్యమైంది. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై పోటీపడేలా సీఎం జగన్ ఈ  కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఇక కార్యక్రమంలో బహుమతులు  కూడా అందజేశారు. నియోజవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలలో బహుమతులు ప్రదానం చేస్తారు. మొత్తం రూ.12 కోట్లకు పైగా నగదును బహుమతులుగా అందజేశారు. ఇలా యువత కోసం మంచి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే.. మరోవైపు కొందరు పని గట్టుకుని విషయం చిమ్ముతున్నారు. ఈ కార్యక్రమాలోని మంచిని గుర్తించకపోగా, అసత్య ప్రచారాలు చేశారు. అలా విషయం చిమ్మినొళ్లందరికి ఈ వీడియో ఓ గుణపాఠమని పలువురు చెప్పుకొచ్చారు.

నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాని నిర్వహించారు. 26 జిల్లాలు, 175 నియోజకవర్గాలు, 680 మండలాలు, 4000 సచివాలయాల పరిధిలో, 11 వేల గ్రామ పంచాయితీల స్థాయిలో మూడు లక్షల మ్యాచ్‌లు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల మంత్రిత్వ శాఖ ‘శాప్‌’ కలిసి ఏర్పాటు  చేశాయి. ఇక ఆడుదాం ఆంధ్రాలో భాగంగా క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, ఖోఖో తో పాటు, యోగా, మారథాన్, టెన్నికాయిట్‌లలో వంటీ పోటీలు నిర్వహించారు. నేటి యువత అత్యంత ఇష్టపడే క్రికెట్‌కు రాష్ట్ర ప్రభుత్వం అగ్ర తాంబూలం ఇచ్చింది. మరి.. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా ఈ బాలుడు చేసిన సాహసం వీడియోపై, ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments