iDreamPost
android-app
ios-app

NTR స్మారక నాణెంపై బండ్ల గణేశ్ షాకింగ్ పోస్ట్!

  • Published Aug 31, 2023 | 5:01 PM Updated Updated Aug 31, 2023 | 5:01 PM
  • Published Aug 31, 2023 | 5:01 PMUpdated Aug 31, 2023 | 5:01 PM
NTR స్మారక నాణెంపై బండ్ల గణేశ్ షాకింగ్ పోస్ట్!

సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన పేరిట స్మారక నాణెంను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నాణెంను విడుదల చేశారు. పౌరులు దీనిని గరిష్టంగా 4800 వరకు చెల్లించి కొనుగోలు చేయచ్చు. హైదరాబాద్ లో కూడా ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎన్టీఆర్ అభిమానులు, కాయిన్ కలెక్ట్ చేసే అలవాటు ఉన్న వాళ్లు ఈ నాణేలను కొనుగోలు చేస్తున్నారు. చాలామంది ఈ నాణెం చెల్లుతుందా? రూ.100 నాణెంను రూ.5 వేలకు ఎందుకు అమ్ముతున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు బండ్ల గణేశ్ తన X ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చారు.

బండ్ల గణేశ్ పోస్ట్ ప్రకారం.. “సాధారణంగా నాణేలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి మారకం, రెండు స్మారకం. మారకం అంటే మార్కెట్ లో మీరు ఉపయోగించో రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలు. రెండోది స్మారక నాణెం. అంటే ఒక జ్ఞాపకార్థం, వారి గౌరవార్థం వీటిని ముద్రిస్తారు. కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ మినిస్ట్రీ అజమాయిషీలో సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్, మింట్ అని రెండు వర్గాలు ఉంటాయి. నాసిక్ లో ఉన్న సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో నగదు, ప్రామిసరీ నోట్లు, స్టాంప్ పేపర్లు ముద్రిస్తారు. హైదరాబాద్, కోల కతా, ముంబయిలో ఉన్న మింట్ లో మారకమయ్యే నాణేలు ముద్రిస్తారు. ఎవరైనా వ్యక్తులు వారి పేరు మీద తమకు కొన్ని నాణేలు కావాలి అంటే వాటిని కూడా ముద్రిస్తారు. కానీ, ఆర్డర్ చేసే సంఖ్య కొంచం ఎక్కువగా ఉండాలి. మొన్న విడుదల చేసిన ఎన్టీఆర్ నాణెం అలాంటిదే. దానిని పురందేశ్వరి ఆర్డర్ చేసి ముద్రించారంట.

అలాంటి స్మారక నాణేలను కాయిన్ కలెక్ట్ చేసేవాళ్లు, దాచుకునే వాళ్లు కొనుగోలు చేస్తారు. ఈవిడ డబ్బు చెల్లించి వాటిని ముద్రించి.. విడుదల చేయమని కోరితే ద్రౌపది ముర్ము ఒప్పుకున్నారు. ఇటీవలే పీవీ నరసింహారావు శత జయంతి జరిగింది. మరి ప్రభుత్వం ఎందుకు ఆయన నాణేన్ని ముద్రించలేదు? ఎందుకుంటే వాళ్ల కుటుంబం ఆ పని చేయలేదు. ఎన్టీఆర్ కుటుంబం పూనుకుంది. ఎన్నికల సమయం కాబట్టి కొంత రాజకీయం కూడా ఉంటుంది” అంటూ బండ్ల గణేశ్ చేసిన పోస్టులో ఉంది. అయితే ఇది బండ్ల గణేశ్ వ్యక్తిగత అభిప్రాయమా? సోషల్ మీడియాలో ఏదైనా పోస్టును తన ఖాతాలో పోస్ట్ చేశారా? అనే విషయం తెలియాల్సి ఉంది. ఫాలోవర్స్ మాత్రం.. మారంక, స్మారకానికి సంబంధించి చాలా మంచి సమాచారాన్ని అందించారంటూ కామెంట్ చేస్తున్నారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom