మారేడుమిల్లి జలపాతంలో వైద్య విద్యార్థులు మృతి! అసలు ఏం జరిగిందంటే!

Maredumilli Waterfalls: నిరంతరం చదువులతో నిమగ్నమై, చాలా ఒత్తిడికి గురైన విద్యార్థులు సరదాగా స్నేహితులతో గడపాలని జలపాతంకు వెళ్లారు. అయితే అప్పటి దాకా ఎంతో సరదాగా గడిపిన వాళ్లకు భారీ వర్షం రూపంలో పెను ప్రమాదం వచ్చి..ముంచేసింది.

Maredumilli Waterfalls: నిరంతరం చదువులతో నిమగ్నమై, చాలా ఒత్తిడికి గురైన విద్యార్థులు సరదాగా స్నేహితులతో గడపాలని జలపాతంకు వెళ్లారు. అయితే అప్పటి దాకా ఎంతో సరదాగా గడిపిన వాళ్లకు భారీ వర్షం రూపంలో పెను ప్రమాదం వచ్చి..ముంచేసింది.

విద్యార్థులు, యువత విహార యాత్రలు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. తరచూ వివిధ ప్రాంతాలను తమ స్నేహితులతో కలసి పర్యటిస్తుంటారు. జలపాతాలు, పచ్చని చెట్లు, కొండలతో కూడిన ప్రకృతిని ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు ఈ విహార యాత్రలు విషాద యాత్రలుగా మారుతున్నాయి. గతంలో కాలేజీ విద్యార్థులు జలపాతల ఉండే ప్రాంతాలకు టూర్ వెళ్లి..అకస్మాత్తుగా వచ్చిన వరదల్లో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. అలా తరచూ ఏదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడిమిల్లిలో విషాదం చోటుచేసుకున్న సంగతి తెలిసింది. జలపాతంలో పడిపోయి..ముగ్గురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు యువతులు ఉన్నారు. ఇక ఈ ఘోర ప్రమాదం ఎలా జరిగిందని, అందరిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. అసలు మారేడుమిల్లి జలపాతంలో వైద్య విద్యార్థుల ప్రమాదంలో ఎలా చిక్కుకున్నారు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరులోని ఆశ్రం కళాశాలలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 15 మంది వైద్యవిద్యార్థులు మారేడుమిల్లికి వెళ్లారు. వారందరూ ట్రావెలర్ వాహనంలో ఆదివారం మారేడుమిల్లి పర్యాటక ప్రాంతానికి వెళ్లారు. ఆ విద్యార్థులు మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలోని ‘జలతరంగిణి’ జలపాతం వద్దకు చేరుకున్నారు. విద్యార్థులు ఆ జలపాతం వద్ద కాసేపు సరదగా గడిపారు.  ఇలా వారు సరదగా ప్రకృతిని ఆస్వాదిస్తున్న క్రమంలోనే ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. ఇదే సమయంలో భారీ వరద వస్తుందని ఆ విద్యార్థులు భావించలేదు. జలపాతం పై నుంచి..భారీ వరద పోటెత్తింది. ఈ క్రమంలోనే జలపాతంలో ఒక్కసారిగా ఉద్ధృతి పెరగడంతో ఓ అయిదుగురు విద్యార్థులు ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు.

ఇదే సమయంలో ఇక కొట్టుకుపోయిన వారిలో విజయనగరానికి చెందిన హరిణిప్రియ, గాయత్రి పుష్ప అనే ఇద్దరమ్మాయిలను  ఒడిశా నుంచి విహారయాత్రకు వచ్చిన ఇద్దరు యువకులు కాపాడారు. అనంతరం వారిద్దరిని రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అందులో హరిణిప్రియ పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం తరలించారు. మిగిలిన ముగ్గురు వరద ప్రవాహంలో కొట్టుకునిపోయి మృతి చెందారు. హరదీప్, కొసిరెడ్డి సౌమ్య, బి. అమృత అనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. మృతులు ముగ్గురు 22 ఏళ్ల లోపువారే. హరదీప్ ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన వ్యక్తి. అలానే కొసిరెడ్డి సౌమ్యది విజయనగరం కాగా, బి. అమృత బాపట్ల జిల్లాకు చెందిన యువతి.

ఇక గల్లంతైన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇక విద్యార్థుల మృతి విషయం తెలిసి.. వారి తల్లిదండ్రులు కన్నీరుమన్నీరుగా విలపిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం ఓ కాలేజీకి చెందిన 23 మంది విద్యార్థులు హిమాచల్ ప్రదేశ్ లో వరద నీటిలో  కొట్టుకుపోయి చనిపోయారు. మొత్తంగా కారణం ఏదైనప్పటికీ తరచూ విహార యాత్రలు విషాద యాత్రలుగా మారుతున్నాయి. జలపాతల వద్దకు విద్యార్థులు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ఇలా పెను విషాదాలను నింపుతుందని పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా విషాదం మిగిలిన ఈ వైద్య విద్యార్థుల విహార యాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments