Dharani
AP Offer Free Insurance: తాజాగా జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. దీని ద్వారా విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఆ వివరాలు..
AP Offer Free Insurance: తాజాగా జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. దీని ద్వారా విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఆ వివరాలు..
Dharani
తల్లిదండ్రులు పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి చదువు అని భావిస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థికి కూడా నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారు. పిల్లల చదువు తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదనే ఉద్దేశంతో.. వారికి అనేక పథకాల ద్వారా సాయం చేస్తున్నారు. మధ్యాహ్న భోజనంలో కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యకరమైన, పౌష్టిక ఆహార పదార్థాలను వారికి అందిస్తున్నారు. ఇక పెద్ద చదువులు చదువుకునేందుకు విదేశాలకు వెళ్లాలని భావించే విద్యార్థులకు జగన్ ప్రభుత్వం అండగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద వారి చదువుకు అయ్యే మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా జగన్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సూచనతో, ఏపీఎన్ఆర్టీఎస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు సేవలను అందిస్తోన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా విదేశాల్లో పని చేసేవారికి బీమా కూడా కల్పిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఏపీఎన్ఆర్టీఎస్ విదేశాల్లో చదువుకుంటున్న ఏపీ విద్యార్థులు, పనిచేసే వారికి శుభవార్త చెప్పింది. వీరందరూ ప్రవాసాంధ్ర భరోసా బీమాలో ఉచితంగా నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది.
ఈ క్రమంలో జగన్ సర్కార్.. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు పూర్తిగా ఉచితంగా బీమాలో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ అవకాశం జనవరి 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. జనవరి 15 తర్వాత బీమా ప్రీమియం పెరిగి, ప్రయోజనాలు తగ్గే అవకాశం ఉన్నందున అర్హులైన వారు వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లిన విద్యార్థులు ఈ బీమా పథకంలో నమోదు చేసుకోవడం వలన హఠాత్తుగా అనుకోని పరిణామాలు జరిగినప్పుడు వారి కుటుంబానికి ఇది ఆర్థికంగా ఆదుకుంటుందని అధికారులు తెలిపారు. విద్యార్థులు, లేదంటే వారి తరఫున వారి పేరు మీద తల్లిదండ్రులు కూడా దీనిలో నమోదు చేయవచ్చని వెల్లడించారు. ఆలస్యం చేయకుండా ప్రవాసాంధ్ర భరోసా బీమాలో ఉచితంగా నమోదు చేసుకోమని ఏపీఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి కోరారు. ఈ పథకం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయన్నారు.
ఈ బీమా పథకంలో నమోదు చేసుకోవడం కోసం APNRTS 24/7 హెల్ప్‌లైన్ +91-863-2340678; +91 85000 27678 (వాట్సాప్)ను సంప్రదించాలన్నారు. వెబ్ సైట్-బీమా పేజి https://www.apnrts.ap.gov.in/index.php/home/insurance_new లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. insurance@apnrts.com; helpline@apnrts.com కు మెయిల్ చేయాలన్నారు. ఏపీఎన్ఆర్టీఎస్ అందించే వివిధ సేవలు, అప్డేట్స్ కొరకు https://www.apnrts.ap.gov.in/ వెబ్‌సైట్ సందర్శించాలన్నారు. విదేశాల్లో చదువుకుంటున్న వారు, పని చేస్తున్న వారు వెంటనే ప్రవాసాంధ్ర భరోసా బీమా నందు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.