APలోని ఆ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ రెండు శుభవార్తలు..

ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంతకు ఆ శుభవార్తలు ఏంటంటే.. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తోన్న వీఆర్‌ఏల డీఏను పునరిద్ధరించడమే కాక.. దాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ సర్క్యులేట్‌ చేయాల్సిందిగా..

ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంతకు ఆ శుభవార్తలు ఏంటంటే.. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తోన్న వీఆర్‌ఏల డీఏను పునరిద్ధరించడమే కాక.. దాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ సర్క్యులేట్‌ చేయాల్సిందిగా..

ఆంధ్రప్రదేశ్‌లోని విలేజ్‌ రెవెన్యూ అసిస్టెంట్‌(వీఆర్‌ఏ)లకు జగన్ సర్కార్‌ ఒకటి కాదు ఏకంగా రెండు గుడ్‌న్యూస్‌లు చెప్పింది. ఈ మేరకు ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇంతకు ఆ శుభవార్తలు ఏంటంటే.. రాష్ట్రంలో విధులు నిర్వహిస్తోన్న వీఆర్‌ఏల డీఏను పునరిద్ధరించడమే కాక.. దాన్ని పెంచుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైల్‌ సర్క్యులేట్‌ చేయాల్సిందిగా.. సంబంధిత శాఖ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు.

వీఆర్‌ఏల డీఏను పునరుద్ధరించడంతోపాటు దానిని పెంచుతూ ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. వీఆర్‌ఏల డీఏను రూ.300 నుంచి రూ.500కు పెంచారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంపై వీఆర్‌ఏలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. జగన్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సుమారు 20,000 మందికి లబ్ది చేకూరనుంది. వీఆర్‌ఏల డీఏ పెంచుతూ.. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయంపై రెవెన్యూ శాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఇతర రెవెన్యూ శాఖాధికారులకు ఏపీజీఈఎఫ్‌ తరఫున వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక గత ప్రభుత్వం వీఆర్‌ఏల డీఏను రద్దుచేస్తే ఈ ప్రభుత్వం పునరుద్ధరించడమే కాక.. రూ.300 నుంచి రూ.500కు పెంచిందన్నారు ఏపీ రెవెన్యూ జేఏసీ చైర్మన్‌ వాసా దివాకర్, ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు. ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

Show comments