Dharani
ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడని వారికి శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడని వారికి శుభవార్త చెప్పింది. ఆ వివరాలు..
Dharani
చంద్రబాబు అండ్ కో స్వార్థం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్లు తీసుకునే వారు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పించన్లు పంపిణీ సహా అనేక ఇతర ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకే చేర్చడం కోసం వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చారు. ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయాన్నే వాలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు చేరుకుని.. వారికి పింఛన్ అందించేవారు. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే వారు. కానీ గత నెల నుంచి పింఛన్ల పంపిణీ వ్యవహారం తీవ్ర గందరగోళంగా మారింది. వాలంటీర్ల ద్వారా పింఛన్ పంపిణీ అడ్డుకోవాలని కోరుతూ.. చంద్రబాబు అండ్ కో ఎన్నికల సంఘాన్ని కోరారు. దాంతో గత నెలలో లబ్ధిదారులు సచివాలయాల వద్దకు వెళ్లి పింఛన్ తీసుకోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారు.
అసలే ఎండలు మండిపోతుండటంతో.. కొందరు వృద్ధులు వడదెబ్బ కారణంగా చనిపోయారు కూడా. దాంతో ఈ నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే డబ్బులు జమ చేస్తామని వెల్లడించింది. అయితే కొందరికి ఇంకా పింఛన్ డబ్బులు జమ కాలేదు. దాంతో వారంతా ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం వారికి శుభవార్త చెప్పింది. బ్యాంక్ ఖాతాలో నగదు జమ కాని వారు భయపడవద్దని.. వారికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి పింఛన్ డబ్బులు ఇస్తారని అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 98.47 మంది పింఛన్ లబ్ధిదారుల అకౌంట్‌లలో పింఛన్ డబ్బులు జమ చేశాము. 48,92,503 మందిలో 48,17,718 మంది ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. అయితే కొందరి విషయంలో బ్యాంకు అకౌంట్‌లు పనిచేయని కారణంగా పింఛను డబ్బులు జమకాలేదు. వారందరికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే వచ్చి.. పింఛన్ నగదు అందజేయాలని నిర్ణయించాము. కనుక బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ కాని వారు ఆందోళన పడాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చారు.
ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 74,399 మంది పింఛనుదారుల బ్యాంకు అకౌంట్‌లలో డబ్బులు జమ కాలేదని.. శశిభూషణ్ కుమార్ వెల్లడించారు. వారందరికి మే 4న సచివాలయ ఉద్యోగులు ఇంటికి వెళ్లి పింఛన్ మొత్తం అందజేస్తారని చెప్పుకొచ్చారు. మొత్తంగా చూస్తే.. 65.49 లక్షల మందికి గాను 63.31 లక్షల (96.67 శాతం) మంది లబ్ధిదారులకు అకౌంట్‌లలో పింఛన్ నగదు జమ చేసినట్లు తెలిపారు. అలాగే 15,13,752 మందికి ఇంటింటికీ వెళ్లి పింఛన్ అందజేశారు అధికారులు. ప్రధానంగా దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పింఛన్ ఇంటికి తీసుకెళ్లి ఇచ్చారు.