iDreamPost
android-app
ios-app

దేవుడికిచ్చిన మాట కోసం.. రూ.20 కే బిర్యానీ.. ఎక్కడంటే..

  • Published Oct 05, 2023 | 6:46 PM Updated Updated Oct 06, 2023 | 10:35 AM
  • Published Oct 05, 2023 | 6:46 PMUpdated Oct 06, 2023 | 10:35 AM
దేవుడికిచ్చిన మాట కోసం.. రూ.20 కే బిర్యానీ.. ఎక్కడంటే..

దేవుడికిచ్చిన మాట కోసం ఓ వ్యక్తి 20 రూపాయలకే రుచికరమైన బిర్యానీ అమ్ముతున్నాడు. కేవలం బిర్యానీ మాత్రమే కాదు.. ఫ్రైడ్‌ రైస్‌, చీకులు కూడా 20 రూపాయలకే విక్రయిస్తున్నాడు. ఆహారం రుచికరంగా ఉండటం.. తక్కువ ధరకే బిర్యానీ వస్తుండటంతో జనం అక్కడకు ఎగబడుతున్నారు. రూ. 20కే బిర్యానీ కథ ఏంటంటే.. తూర్పుగోదావరి జిల్లా, అల్లవరానికి చెందిన గోడి సత్యనారాయణ గుడ్డివానిచింత దగ్గర నాలుగేళ్ల క్రితం బిర్యానీ పాయింట్‌, మీల్స్‌ అమ్మకాలు మొదలెట్టారు.

హోటల్‌కు తక్కువ టైంలోనే ఎక్కువ ఆదరణ వచ్చింది. ఇక, సత్యనారాయణకు కూతురు అంజలి అంటే పిచ్చి ప్రేమ. కుమార్తె బర్త్‌డేన ప్రతీ ఏటా ఆయన చర్చి దగ్గర బిర్యానీ పంచిపెట్టేవారు. తాను వ్యాపారంలో నిలదొక్కుకుంటే 20కే బిర్యానీ అందిస్తానని కూతురు పుట్టిన రోజున దేవుడికి మొక్కుకున్నారు. అనుకున్నదాని కంటే అద్భుతంగా వ్యాపారం సాగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం మే నెలలో తన కూతురు అంజలి పేరిట బిర్యానీ పాయింట్‌ తెరిచారు.

అంజలి బిర్యానీ పాయింట్‌లో  20 రూపాయలకే రుచికరమైన బిర్యానీ.. ఫ్రైడ్‌ రైస్‌, చీకులు అమ్ముతున్నాడు. తక్కువ ధర, వంటలు రుచిగా ఉండటంతో జనం పెద్ద ఎత్తున అక్కడికి వస్తున్నారు. అయితే, సాయంత్రం 6 నుంచి మాత్రమే ఈ ఐటమ్స్‌ తక్కువ ధరకు అందుబాటులో ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాధారణ రేట్లకే అన్నిటిని విక్రయిస్తున్నారు. మరి, దేవుడికి ఇచ్చిన మాట కోసం గోడి సత్యనారాయణ రూ.20 కే బిర్యానీ అమ్మటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibom