Ambedkar Statue: అంబేడ్కర్ విగ్రహావిష్కరణకు స్వచ్ఛందంగా తరలిరావాలన్న CM జగన్!

విజయవాడలో సామాజిక నిలువెత్తు రూపం ఆవిష్కృతం కానుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహోన్నత రూపం ప్రజలందరికీ దర్శనం ఇవ్వబోతోంది.

విజయవాడలో సామాజిక నిలువెత్తు రూపం ఆవిష్కృతం కానుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహోన్నత రూపం ప్రజలందరికీ దర్శనం ఇవ్వబోతోంది.

ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న విజయవాడ నగరంలో సామాజికి న్యాయానికి నిలువెత్తు రూపం ఆవిష్కృతం కానుంది. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మహోన్నత రూపం ప్రజలందరికీ దర్శనం ఇవ్వబోతోంది. బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం కోసం కృషి చేసిన అంబేడ్కర్​ నిలువెత్తు విగ్రహం ఆవిష్కృతం కానుంది. ఈ నెల 19వ తేదీన విజయవాడలో 206 అడుగుల అంబేడ్కర్ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలందరూ ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ఆయన ఆసక్తికర పోస్ట్ పెట్టారు. విజయవాడలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేడ్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు మొత్తం దేశానికే తలమానికం అంటూ ఓ వీడియో పోస్ట్ చేశారు.

‘విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం. ఇది “స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌”. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు స్ఫూర్తినిస్తుంది. ఈనెల 19న జరిగే విగ్రహావిష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని కోరుతున్నాను’ అని ఆ వీడియోలో చెప్పుకొచ్చారు సీఎం జగన్. ఇక, విజయవాడలో ఆవిష్కృతం కానున్న అంబేడ్కర్ విగ్రహం దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్​గా రికార్డు సృష్టించింది. అంబేడ్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలకు అద్దం పట్టేలా ఈ అద్భుత కళాఖండాన్ని తీర్చిదిద్దారు. ఈ విగ్రహ పీఠం కింది భాగంలో నిర్మించిన బిల్డింగ్​లో అంబేడ్కర్​కు సంబంధించిన ఫొటో గ్యాలరీతో పాటు జీవిత విశేషాల శిల్పాలు, ఆయన లైఫ్​కు సంబంధించిన బుక్స్​తో కూడిన లైబ్రరీని ఏర్పాటు చేశారు.

అంబేడ్కర్ జీవిత చిత్రాలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరించారు. అలాగే ఇక్కడ అంబేడ్కర్ ఎక్స్​పీరియెన్స్ సెంటర్, కన్వెన్షన్ సెంటర్, మినీ థియేటర్, ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించారు. పిల్లలు ఆడుకునేందుకు ప్లే ఏరియా, అందమైన గార్డెన్లు, మ్యూజిక్ ఫౌంటెయిన్, వాటర్ ఫౌంటెయిన్, ఫుడ్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ స్మృతివనం గోడల మీద స్వాతంత్ర్యోద్యమ ఘట్టాలను అపురూప కళాఖండాలుగా ఆవిష్కరించారు. ఫ్రీడమ్ ఫైటర్స్​తో కూడిన కళాఖండాలు కూడా స్పెషల్ అట్రాక్షన్​గా నిలవనున్నాయి. అంబేడ్కర్ స్మృతివనం చుట్టూ ప్రహారీ మొత్తం రాజస్థాన్ పింక్ కలర్ స్టోన్స్​తో అద్భుతంగా నిర్మించారు. ఇందులో అక్కడక్కడా పాలరాతిని కూడా వినియోగించారు.

ఇదీ చదవండి: కుప్పానికి కృష్ణమ్మ జలాలు! 14 ఏళ్లలో బాబు చేయలేనిది జగన్ చేశారు!

Show comments