iDreamPost
android-app
ios-app

ACB కోర్టులో చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ!

ఏపీ స్కీల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ శుక్రవారమూ కలిసి రాలేదు. సుప్రీం కోర్టు నుంచి ఏసీపీ వరకు ఉన్న అన్ని న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు, విజయవాడలోని ఏసీబీ కోర్టు.. రెండు న్యాయస్థానాల్లో శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు.

ఏపీ స్కీల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ శుక్రవారమూ కలిసి రాలేదు. సుప్రీం కోర్టు నుంచి ఏసీపీ వరకు ఉన్న అన్ని న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు, విజయవాడలోని ఏసీబీ కోర్టు.. రెండు న్యాయస్థానాల్లో శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు.

ACB కోర్టులో చంద్రబాబుకు మరో ఎదురు దెబ్బ!

ఏపీ స్కీల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఈ శుక్రవారమూ కలిసి రాలేదు. సుప్రీం కోర్టు నుంచి ఏసీపీ వరకు ఉన్న అన్ని న్యాయస్థానాల్లో వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు, విజయవాడలోని ఏసీబీ కోర్టు.. రెండు న్యాయస్థానాల్లో శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. లీగల్ ములాఖత్ కు సంబంధించి చంద్రబాబు తరపు లాయర్లు వేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. లీగల్‌ ములాఖత్‌ల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు విజయవాడలోని అవినీతి నిరోధక శాఖ కోర్టులో పిటిషన్ వేశారు. వివిధ కోర్టుల్లో కేసుల విచారణ ఉన్నందున రోజుకు మూడుసార్లు ములాఖత్‌ను పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు పిటిషన్‌ వేశారు.

గురువారం ములాఖత్‌ల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని బాబు లాయర్లు కోరారు. ఈ పిటిషన్‌ను శుక్రవారం ఏసీబీ కోర్టు తిరష్కరించింది. అలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది.శుక్రవారం ఈ పిటిషన్‌ ఏసీబీ కోర్టు ముందుకు రాగా.. న్యాయస్థానం కొట్టేసింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో ఈ పిటిషన్‌ విచారణకు అర్హత లేదని తిరస్కరించింది. అంతేకాక సరైన లీగల్‌ ఫార్మట్‌లో దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించింది. రోజుకు ఒకసారి మాత్రమే చంద్రబాబుతో న్యాయవాదుల ములాఖత్‌కు అనుమతించింది. మరోవైపు శుక్రవారం ఫైబర్ నెట్ కేసు ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు నవంబర్ 9కి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం తాలూకూ ప్రభావం నేడు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ జరిగే విచారణపై కూడా పడే అవకాశాలు కనిపిస్తున్నాయని న్యాయ నిపుణలు అంటున్నారు. ఏపీ సీఐడీ చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఏసీబీ కోర్టు.. చంద్రబాబును నేరుగా కోర్టులో హాజరు పర్చాలని కూడా ఆదేశించింది. కానీ, సుప్రీం కోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండడంతో.. అది వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం జరగాల్సిన పీటీ వారెంట్ విచారణ సైతం వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి.. శుక్రవారం సుప్రీం కోర్టు, ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు నిరాశే ఎదరవడంతో.. ఇదే చంద్రబాబుకు బ్లాక్ ఫ్రైడే అంటూ  సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరి.. ఈ ప్రచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి