iDreamPost
android-app
ios-app

క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన ప్రముఖ సీరియల్‌ నటి!

  • Published Aug 31, 2023 | 9:26 AM Updated Updated Aug 31, 2023 | 9:26 AM
  • Published Aug 31, 2023 | 9:26 AMUpdated Aug 31, 2023 | 9:26 AM
క్యాస్టింగ్‌ కౌచ్‌పై స్పందించిన ప్రముఖ సీరియల్‌ నటి!

చిత్ర పరిశ్రమలో ఆడవాళ్లు ఎదుర్కొనే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్యాస్టింగ్‌ కౌచ్‌గా చెప్పుకునే సినిమా పరిశ్రమల్లోని మహమ్మారి కారణంగా ఎంతో మంది నటీమణులు నరకం అనుభవించారు.. ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. అవకాశం ఇవ్వాలంటే బెడ్‌రూముకు రావాల్సిందే అన్న వాళ్లు కూడా లేకపోలేదు. మొదట్లో చిత్ర పరిశ్రమలో తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడటానికి నటీమణులు ఆలోచించేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీటూ ఉద్యమం మొదలైన తర్వాత ఎలాంటి భయం లేకుండా నోరు విప్పుతున్నారు.

తరచుగా ఎవరో ఒకరు తమకు ఎదురైన అనుభవాలను బయటకు చెబుతున్నారు. తాజాగా, ప్రముఖ తమిళ నటి రేష్మ ప్రసాద్‌ తనకు ఎదురైన క్యాస్టింగ్‌ కౌచ్‌ అనుభవాలను చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘‘ సైడ్‌ క్యారెక్టర్‌, క్యారెక్టర్‌ రోల్స్‌కు కూడా అడ్జస్ట్‌మెంట్స్‌ అడిగారు. టుబి ఫ్రాంక్‌.. చాలా ఓపెన్‌గా అడిగారు. చిన్న రోల్‌కు కూడా అడ్జస్ట్‌మెంట్‌ అడిగారు. అడ్జస్ట్‌మెంట్‌ ఉంటే క్యారెక్టర్‌ వస్తుందని అన్నారు. అందరూ ఇలానే అడిగారు. పోండ్రా! మీకు వేరే పని లేదా అనుకునేదాన్ని.

నాకు ఏమీ అవసరం లేదు అని చెప్పేదాన్ని.. వచ్చే టప్పుడు అవకాశాలు వస్తాయి. నేను చూసుకుంటాను అనేదాన్ని. చాలా ఓపెన్‌గా అడిగేవారు. ఫ్రొఫైల్‌ సమయంలో కూడా అడ్జస్ట్‌మెంట్‌ మీకు ఓకేనా అన్న కాలమ్‌ పెట్టారు. ఓకే కాదు అని చెప్పినా కూడా.. మళ్లీ ఫోన్‌ చేసేవారు. నేను నో అని చెప్పేదాన్ని’’ అంటూ తన అనుభవాలను చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి,  ఇండస్ట్రీలో నటీమణులు ఎదుర్కొంటున్న క్యాస్టింగ్‌ కౌచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet