iDreamPost

గుండె పోటుతో ప్రముఖ సినీ, టీవీ నటుడు కన్నుమూత

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఊహించని విధంగా సినీ సెలబ్రిటీలు గుండె పోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో నటుడ్ని బలి తీసుకుంది హార్ట్ ఎటాక్

ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఊహించని విధంగా సినీ సెలబ్రిటీలు గుండె పోటుతో మరణిస్తున్నారు. తాజాగా మరో నటుడ్ని బలి తీసుకుంది హార్ట్ ఎటాక్

గుండె పోటుతో ప్రముఖ సినీ, టీవీ నటుడు కన్నుమూత

చిట్టి గుండె నానాటికి బలహీన పడుతుంది. కరోనా.. ఆ తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. సామాన్యుడినే కాదూ సెలబ్రిటీలను కూడా వదలడం లేదు హార్ట్ స్ట్రోక్. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా,  కనీసం నలతగా కూడా అనిపించకుండానే ప్రాణాలను హరించేస్తుంది మాయదారి గుండె పోటు. సినిమా రంగానికి చెందిన అనేక మంది హార్ట్ ఎటాక్ కారణంగా మరణించారు. చిరంజీవి సర్జా, పునీత్ రాజ్ కుమార్, తారకరత్న వంటి యంగ్ స్టార్సే కాకుండా..  ఎంతో మంది సీనియర్ నటులు హార్ట్ స్ట్రోక్‌తో చనిపోయారు. ఇప్పుడు మరో స్టార్ టీవీ నటుడ్ని గుండెపోటు బలితీసుకుంది. ప్రముఖ టీవీ నటుడు రీతురాజ్ సింగ్ హార్ట్ ఎటాక్ కారణంగా మరణించారు. ఈ విషయాన్ని ఆయన స్నేహితుడు, నటుడు అబిత్ బెహ్ల ధ్రువీకరించారు.

రీతు రాజ్.. కొంత కాలం క్రితం పాంక్రియాస్ చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు. అనంతరం ఇంటికి తిరిగి వచ్చాడు. అంతలోనే గుండె పోటుకు గురై మరణించినట్లు వెల్లడించాడు స్నేహితుడు. ఆయన మృతి వార్త తెలియగానే.. సినీ సెలబ్రిటీలు షాక్ వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. రాజస్తాన్ వాసి అయిన రీతూ రాజ్ ఢిల్లీలో చదువుకుని ఆ తర్వాత అమెరికా వెళ్లిపోయారు. తిరిగి ఇండియాకు వచ్చిన వీరి కుటుంబం ముంబయిలో సెటిల్ అయ్యింది. ఆయన టెలివిజన్‌తో పాటు అనేక సినిమాల్లో నటించాడు. బనేగీ అప్నీ బాత్, జ్యోతీ, హిట్లర్ దీదీ, షపత్, వారియర్ హై, అదాలత్, దియా ఔర్ బాతీ హమ్, సీఐడీ సీరియల్స్‌లో నటించారు.

Popular film and TV actor passed away due to heart attack

ప్రస్తుతం ఆయన అనుపమ అనే ధారా వాహికలో యశ్పాల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇందులో అతడికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. ఆయన హిందీతో పాటు తమిళంలో ఓ చిత్రంలో నటించారు. అజిత్ హీరోగా వచ్చిన తనివు (తెగింపు)తో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. గత ఏడాది ఈ సినిమా తమిళనాట మంచి హిట్ కూడా అందుకుంది. ఇక ఆయన అనేక వెబ్ సిరీస్ లు కూడా చేశారు. క్రిమినల్ జస్టిస్, అభయ్, బందీస్ బండిట్స్, మేడిన్ హెవెన్, రీసెంట్ గా వచ్చిన ఇండియన్ పోలీస్ ఫోర్స్‌లో కనిపించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి