iDreamPost

ఈ నెల 30న గడువు పూర్తి.. తక్కువ ధరకు మద్యం అమ్మితే లక్షల్లో ఫైన్

తెలంగాణలో మద్యం దుకాణాదారులకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఈ నెల 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజున పాత మద్యం విధానానికి చెక్ పడనుంది. డిసెంబర్ 1 నుండి కొత్త యజమానులు రానున్నాను. ఈ నేపథ్యంలో..

తెలంగాణలో మద్యం దుకాణాదారులకు పెద్ద తలనొప్పి వచ్చి పడింది. ఈ నెల 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజున పాత మద్యం విధానానికి చెక్ పడనుంది. డిసెంబర్ 1 నుండి కొత్త యజమానులు రానున్నాను. ఈ నేపథ్యంలో..

ఈ నెల 30న గడువు పూర్తి.. తక్కువ ధరకు మద్యం అమ్మితే లక్షల్లో ఫైన్

దేశంలో సమయానికి టాక్స్ పే చేసేది ఎవరంటే.. మద్యం ప్రియులే. ఉద్యోగులైనా టైం పంక్చువాలిటీ మిస్ అవుతారేమో కానీ.. వీళ్లు మాత్రం సాయంత్రం 6-7 గంటల తర్వాత ఠంచనుగా బార్ షాపుల ముందు వాలిపోవాల్సిందే. వీళ్లకు బీర్, రమ్, విస్కీ, బ్రాందీ, ఓడ్కా, జిన్ అంటే ఓ ఎమోషన్. మద్యం షాపుల్లో తాగి, తూగి ఎంజాయ్ చేయాల్సిందే. అయితే తిప్పలు ఎప్పుడు తాగేటోళ్లకేనా.. అమ్మేటోళ్లకు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న మద్యం యజమానుల పరిస్థితి నూతిలో పడ్డ ఎలక మాదిరి అయిపోయింది. దానికి కారణం ప్రస్తుతమున్న మద్యం విధానానికి కాలం చెల్లిపోవడమే. డిసెంబర్ 1 నుండి కొత్త లైసెన్స్ పొందిన యజమానులు విక్రయాలు ప్రారంభించనున్నారు. దీంతో ఈ గడువులోగా ఇప్పటి మద్యం వ్యాపారులు తమ దుకాణాల్లోని మొత్తం సరుకు ఖాళీ చేయాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో మద్యం విక్రయాలపై ఓ కన్నేసింది ఎక్సైజ్ శాఖ. నవంబర్ 30తో ప్రస్తుతమున్న మద్యం విధానానికి గడువు పూర్తి కావొస్తుండటంతో.. మద్యం దుకాణాల్లో ఉన్న సరుకును మొత్తం ఆ లోగా అమ్మేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో తక్కువ ధరకే సేల్ చేస్తారన్న అనుమానంతో.. ఎక్సైజ్ శాఖ ముందే మేల్కొంది. ఎమ్మార్పీ కన్నా తక్కువకు మద్యం విక్రయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. అలా చేస్తే కఠిన చర్యలు, శిక్షలు తప్పవని హెచ్చరిస్తోంది. తెలంగాణలో 2023-25 సంబంధించి రెండేళ్ల కాలానికి మద్యం టెండర్లు ఆహ్వానించగా.. పలువురు దుకాణాలను దక్కించుకున్నారు. డిసెంబర్ 1 నుండి కొత్త లైసెన్స్ విక్రయదారులు.. ఆ దుకాణాలను హ్యాండోవర్ చేసుకోనున్నారు.

తెలంగాణలో మొత్తం 2,620 మద్యం దుకాణాలున్నాయి. అయితే డిసెంబర్ 30న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో.. మూడు రోజుల పాటు బార్లు మూసేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 28 నుండి 30వ తేదీ సాయంత్రం వరకు రాష్ట్రంలో వైన్స్, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ లెక్కన చూస్తే.. ఇప్పటి దుకాణాదారులకు ఈ రోజేనే అలాగే 30వ తేదీ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యాన్ని విక్రయించాల్సి ఉంటుంది. ఈ తక్కువ సమయంలోనే స్టాక్ అంతా ఖాళీ చేయాల్సిన పరిస్థితి. దీంతో వ్యాపారులు ఎమ్మార్పీ కన్నా తక్కువ ధరకే మద్యం అమ్ముతున్నారన్న ఉద్దేశంతో ఎక్సైజ్ శాఖ అధికారులు నిఘా పెంచారు. బాటిల్ పై ఉన్న ధర కన్నా తక్కువకు అమ్మితే.. రూ. 3 లక్షల నుండి రూ. 4 లక్షల వరకు ఫైన్.. నేరం రుజువైతే 6 నెలల నుండి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష పడనుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ కమిషనర్ జ్యోతి బుద్దప్రకాశ్ ఉత్తర్వులు జారీ చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి