iDreamPost

రైతులకు శుభవార్త.. రూ.లక్ష లోపు రుణమాఫీ పూర్తి చేసిన ప్రభుత్వం

రైతులకు శుభవార్త.. రూ.లక్ష లోపు రుణమాఫీ పూర్తి చేసిన ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. అలానే రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. రైతుబంధు పేరుతో తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెట్టుబడికి ఆర్థిక సాయం చేస్తుంది. ఇటీవలే రుణమాఫీ విషయంలో రైతన్నలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. వెంటనే రుణాలను మాఫీ చేయాలంటూ సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో… ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రక్రియ మొదలైంది. తాజాగా లక్షలోపు రుణమాపీని కేసీఆర్ సర్కార్ పూర్తి చేసింది.

స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు తెలంగాణ రైతాంగానికి సీఎం కేసీఆర్ శుభవార్తను చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్‌ సర్కార్ రూ.లక్షలోపు రుణమాఫీ చేసింది. సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేసింది. రుణమాఫీకి సంబంధించి బ్యాంకులకు తెలంగాణ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. 2018 డిసెంబర్ 11నాటికి రాష్ట్రంలో లక్షలోపు పంట రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించించిన సంగతి తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వం రుణమాఫీని పూర్తి చేసింది. ఇప్పటి వరకు 16.16లక్షల మంది రైతులకు చెందిన రూ.7,753కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి.

ఆగష్టు2న జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో రుణమాఫీపై నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్‌..  మరుసటి రోజు నుంచి రైతుమాఫీని ప్రారంభించాలని ఆర్థికమంత్రి హరీశ్‌రావు, అధికారులను ఆదేశించారు. రుణమాఫీలో ప్రక్రియ 3న ప్రారంభం కాగా.. తొలిరోజు రూ.41వేల లోపు 62,758 మంది రైతుల రుణాలను మాఫీ చేసింది. విడుదల వారీగా రైతుల రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తూ వచ్చింది. సోమవారం ఒకేసారి లక్ష లోపు ఉన్న 10.79లక్షల మంది రైతుల రూ.6,546.05కోట్లను మాఫీ చేసింది. రుణమాఫీ చేసినందుకు సీఎం కేసీఆర్‌కు రైతులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. మరి.. సీఎం కేసీఆర్.. రైతులకు రుణమాఫీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి