iDreamPost

Ola, Uber గిగ్ వర్కర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలకమైన జీవో జారీ!

టీవల హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన సమావేశంలో ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లకు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కు ప్రమాద బీమా కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన కీలక జోవో జారీ అయ్యింది.

టీవల హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన సమావేశంలో ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లకు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కు ప్రమాద బీమా కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన కీలక జోవో జారీ అయ్యింది.

Ola, Uber గిగ్ వర్కర్లకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. కీలకమైన జీవో జారీ!

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణకు తొలి ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్ది తనదైన మార్క్ పాలనతో అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ వాటిని అమలు చేసేదిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఓలా, ఉబర్, ఆటో డ్రైవర్లకు, ఫుడ్ డెలివరీ బాయ్స్ కు ప్రమాద బీమా కల్పిస్తామని సీఎం రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన కీలక జీవో జారీ అయ్యింది.

తెలంగాణ గవర్నమెంట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా పాలసీ సదుపాయం కల్పిస్తూ శనివారం జీవో జారీ చేసింది. ఇటీవల హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, ఫుడ్ డెలవరీ బాయ్ ల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. త్వరలోనే వీరికోసం రూ. 5లక్షల ప్రమాద బీమాను అందించడంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే క్యాబ్ డ్రైవర్లకు ఓలా, ఉబర్ తరహాలో.. టీహబ్ ద్వారా సర్కార్ యాప్ ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.

ఈ క్రమంలో తాజాగా గిగ్ వర్కర్లకు రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై గిగ్‌ వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక నాలుగు నెలల క్రితం.. ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కుక్క తరమడంతో మూడో అంతస్తు నుంచి పడి చనిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ కుటుంబానికి రూ.2 లక్షల పరిహారాన్ని నేడు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అందించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రేవంత్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి గిగ్ వర్కర్లకు ప్రమాద బీమా కల్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి