iDreamPost

వాహనదారులకు గుడ్ న్యూస్.. చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు

పెండింగ్ చలాన్ల రాయితీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు మరోసారి అవకాశం కల్పిస్తూ చలాన్ల చెల్లింపు గడువును మళ్లీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

పెండింగ్ చలాన్ల రాయితీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనదారులకు మరోసారి అవకాశం కల్పిస్తూ చలాన్ల చెల్లింపు గడువును మళ్లీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

వాహనదారులకు గుడ్ న్యూస్.. చలాన్ల రాయితీ గడువు మరోసారి పెంపు

వాహనదారులకు గుడ్ న్యూస్. చలాన్ల రాయితీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ గడువును మరోసారి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు పెండింగ్ చలాన్లు చెల్లించని వాహనదారులకు మరోసారి అవకాశం లభించినట్లైంది. కాగా చలాన్లపై రాయితీ గడువు జనవరి 31 తో ముగిసింది. అయితే ఇంకా వసూల్ కావాల్సిన పెండింగ్ చలాన్లు ఉండడంతో ప్రభుత్వం మరోసారి గడువును పెంచింది. ఈ సారి మరో 15 రోజులు గడువును పెంచుతూ ఫిబ్రవరి 15 వరకు రాయితీపై చలాన్ల చెల్లింపు గడువును పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పలు తెప్పలుగా పేరుకు పోయిన పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు చలాన్లపై రాయితీని ప్రకటించింది. గతేడాది డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే డిసెంబర్ 25 వరకు పెండింగ్ లో ఉన్న చలాన్లకు మాత్రమే వర్తింస్తుందని స్పష్టం చేశారు. కాగా చలాన్లపై రాయితీ గడువును జనవరి 10 వరకు విధించింది. అప్పటి వరకు వాహనదారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో జనవరి 31 వరకు గడువును పెంచింది ప్రభుత్వం. ఇక తాజాగా ఈ గడువు కూడా ముగియడంతో మరోసారి చలాన్లపై రాయితీ గడువును ఫిబ్రవరి 15 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Challan concession deadline extended again

పెండింగ్ చలాన్లపై భారీ రాయితీని ప్రకటించింది ప్రభుత్వం. టూ, త్రీ వీలర్స్ వాహనాలపై 80 శాతం, లైట్, హెవీ మోటార్ వెహికల్స్ పై 50 శాతం, ఆర్టీసీ బస్సులకు 90 శాతం రాయితీ ప్రకటించింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌ చలాన్లు రూ. 3.59 కోట్లు ఉండగా దాదాపు రూ. 1.50 కోట్ల చలాన్లకు పైగా చెల్లింపులు జరిగినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల రాయితీతో ప్రభుత్వానికి రూ. 135 కోట్లకు పైగానే ఆదాయం సమకూరింది. గడువు పెంపుతో రాష్ట్ర ఖజానాకు మరింత ఆదాయం సమకూరనున్నది. ఇప్పటి వరకు చలాన్లు చెల్లించని వాహనదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి