iDreamPost

సీటు బెల్టు పెట్టులేదని ట్రాక్టర్ డ్రైవర్ కి జరిమానా! ఎక్కడంటే..

ట్రాఫిక్ పోలీసులు.. రూల్స్ అతిక్రమిస్తూ వాహనాలను నడిపిన వారికి జరిమానాలు విధిస్తారు. తరచూ తనిఖీలు చేపడుతూ.. ట్రాఫిక్ నింబంధనలను ఉల్లంఘించిన వారికి ఫైన్లు విధిస్తుంటారు. అయితే కొన్ని సార్లు వాళ్లు విధించే కొన్ని జరిమానాలు చర్చనీయాశంగా మారుతాయి.

ట్రాఫిక్ పోలీసులు.. రూల్స్ అతిక్రమిస్తూ వాహనాలను నడిపిన వారికి జరిమానాలు విధిస్తారు. తరచూ తనిఖీలు చేపడుతూ.. ట్రాఫిక్ నింబంధనలను ఉల్లంఘించిన వారికి ఫైన్లు విధిస్తుంటారు. అయితే కొన్ని సార్లు వాళ్లు విధించే కొన్ని జరిమానాలు చర్చనీయాశంగా మారుతాయి.

సీటు బెల్టు పెట్టులేదని ట్రాక్టర్ డ్రైవర్ కి జరిమానా! ఎక్కడంటే..

తరచూ ఏదో ఒక ప్రాంతంలో  రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ఇక ఈ ప్రమాదాలకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కూడా ఓ ప్రధాన కారణం. అందుకే రోడ్డు ప్రమాదాలన నివారించేందుకు ప్రభుత్వాలు, పోలీసులు అనేక చర్యలు తీసుకుంటారు. అలానే ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించిన వారికి ఫైన్లు వేస్తుంటారు. ఇలా ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కొందరు మాత్రం ఇష్టానుసారం రోడ్లపై వాహనాలను నడపుతుంటారు. ఈ విషయాలు కాసేపు పక్కన పెడితే పలు సందర్భాల్లో ట్రాఫిక్ పోలీసులు వేసే జరిమానాలు ఆశ్చర్యానికి కలిగిస్తుంటాయి. తాజాగా ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదని ఫైన్ విధించారు. మరి.. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై పోలీసులు కొరడ ఝలిపిస్తుంటారు. తరచూ తనిఖీలు చేపడుతూ.. నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాలు విధిస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. కొన్ని సార్లు ట్రాఫిక్ పోలీసులు వేసే జరిమానాలు చర్చనీయాంశంగా మారుతుంటాయి. సైకిల్ పై వెళ్లే వారికి హెల్మెంట్ లేదని, కార్లు ఉన్నవారికి హెల్మెంట్ లేదంటూ ఫైన్ లు విధించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఘటనలు చూసినప్పుడు నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. ట్రాక్టర్‌ డ్రైవర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ బ్లూ కోల్ట్స్‌ పోలీసులు జరిమానా విధించారు. ఈ ఘటన గురువారం వెలుగు చూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.

పాల్వంచ మండలం నాగారం నుంచి పాల్వంచ వైపు మట్టిలోడ్‌తో ఓ ట్రాక్టర్‌ వస్తోంది. అదే సమయంలో మార్గం మధ్యలో  బ్లూ కోల్ట్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఈ ట్రాక్టర్ ను బ్లూ కోల్ట్స్ పోలీసులు ఆపారు. ట్రాక్టర్ డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోలేదంటూ రూ.1000  జరిమానా ధించారు. అయితే, ట్రాక్టర్‌కు సీటు బెల్టు ఉండదని పోలీసులకు చెప్పినా వినిపించుకోకుండా ఫైన్ విధించారని డ్రైవర్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా స్టీరింగ్‌ ఉన్న ప్రతీ వెహికల్ డ్రైవర్‌ ట్రాఫిక్‌ నిబంధనల మేరకు సీట్‌ బెల్టు పెట్టుకోవాల్సిందేనని చెప్పడం గమన్హరం. అయితే ఈ ఘటనపై పలువురు కామెంట్స్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, ఇలాంటి తనిఖీలు అవసరమే కానీ, ట్రాక్టర్ కి కూడా ఇలా చేయడం ఆశ్చర్యంగా ఉందంటూ అభిప్రాయా పడుతున్నారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి