iDreamPost

బ్రేకింగ్: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగించిన ప్రభుత్వం.. ఎప్పటి వరకంటే?

Telangana Traffic Challan: వాహనదారులకు గుడ్ న్యూస్. ట్రాఫిక్ చలాన్ల రాయితీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాపిక్ చలాన్ల రాయితీ ఆఫర్ ను ప్రభుత్వం తాజాగా పొడిగించింది.

Telangana Traffic Challan: వాహనదారులకు గుడ్ న్యూస్. ట్రాఫిక్ చలాన్ల రాయితీపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాపిక్ చలాన్ల రాయితీ ఆఫర్ ను ప్రభుత్వం తాజాగా పొడిగించింది.

బ్రేకింగ్: ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువు పొడిగించిన ప్రభుత్వం.. ఎప్పటి వరకంటే?

గతేడాది తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసేందుకు చలాన్లపై రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో వాహనదారులు తమ వాహనాలపై ఉన్న చలాన్లను క్లియర్ చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. డిసెంబర్ 26 నుంచి చలాన్ల రాయితీ అమల్లోకి వచ్చింది. డిసెంబర్ 25 2023 వరకు ఉన్న పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా రాష్ట్రంలో మొత్తం పెండింగ్ చలాన్లు 3 కోట్ల 59 లక్షలు ఉన్నట్లు సంబంధిత అధికారలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ అందించింది.

కాగా ఇప్పటి వరకు కోటి ఏడు లక్షల మంది వాహనదారులు తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేశారు. దీంతో ప్రభుత్వానికి 107 కోట్ల ఆదాయం వచ్చింది. అయితే ఇంకా 2 కోట్ల పెండింగ్ చలాన్లు చెల్లించాల్సి ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా చలాన్లపై రాయితీ ఆఫర్ నేటితో(జనవరి 10) ముగియనున్నది. ఈ నేపథ్యంలో వాహనదారుల నుంచి కాస్త స్పందన తగ్గడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు ట్రాపిక్ చలాన్ల రాయితీని ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 31 వరకు చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు తమ వాహనాలపై ఉన్నటువంటి పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోని వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చలానాలను విధిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొన్ని కొన్ని సార్లు చలాన్ల మొత్తం ఆ బండి విలువ కంటే కూడా ఎక్కువై పోతుంటుంది. ఈ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసేందుకు ప్రభుత్వం చలాన్లపై డిస్కౌంట్ ప్రకటించింది. టూ వీలర్స్, ఆటోలపై ఉన్న పెండింగ్ చలాన్లకు 80 శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ మోటార్‌‌‌‌ వెహికల్స్‌‌ కు 60 శాతం రాయితీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాహనాదారులు చలాన్లను చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు. ఇక, రాష్ట్రంలో మూడు కోట్ల 59 లక్షల పెండింగ్‌ చలాన్స్‌ కట్టాల్సి ఉంది.

కాగా చలాన్లపై రాయితీకి భారీగా స్పందన వస్తుండడంతో ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయలు వచ్చి చేరుతున్నాయి. ఇప్పటి వరకు 107 కోట్లు వసూలైనట్లు సంబంధిత అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే ఇంకా రెండు కోట్లకు పైగా చలాన్లు వసూల్ కావాల్సి ఉండడంతో ప్రభుత్వం చలాన్ల రాయితీ ఆఫర్ ను పొడిగించింది. ఇంకా పెండింగ్ చలాన్లను క్లియర్ చేయని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. వాహనదారులు మీ సేవా, టీ వ్యాలెట్, పేటీఎంల ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరనున్నది. మరి పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ పొడిగించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి