iDreamPost

పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులకు బిగ్ అలెర్ట్!

తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలెర్ట్ వచ్చింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డిస్కౌంట్ ఆఫర్‌ గడువు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వూలు జారీ చేసింది.

తెలంగాణలోని వాహనదారులకు బిగ్ అలెర్ట్ వచ్చింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ డిస్కౌంట్ ఆఫర్‌ గడువు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వూలు జారీ చేసింది.

పెండింగ్ చలాన్ల విషయంలో వాహనదారులకు బిగ్ అలెర్ట్!

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి పోలీసులు జరిమానా విధిస్తారనే సంగతి అందరికి తెలిసిందే. అయితే వీటిని చాలా మంది వాహనాదారులు తమకు పడిన జరిమానాలు కట్టకుండా పెడింగ్ లో పెడుతుంటారు. అయితే ఈ పెండింగ్ చలాన్లు క్లియర్ చేయించేందుకు ప్రభుత్వం, అధికారులు ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పెండింగ్‌‌‌‌ చలాన్లు క్లియర్‌‌‌‌ చేయించేందుకు డిస్కౌంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్‌‌‌‌కు వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. పెద్ద సంఖ్యలో వచ్చి..తమ పెడింగ్ చలాన్లను క్లియర్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా వాహనాదారులకు బిగ్ అలెర్టను పోలీసులు తెలిపారు. రేపటి తో  చలాన్లు గడువు ముగియనుంది.  ఈ గడువును పెంచేది లేదని పోలీసులు స్పష్టం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కోసం అధికారులు డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 27న డిస్కౌంట్ ఆఫర్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సమయంలో కేవలం పదిహేను రోజులు మాత్రమే ఉంటుందని తెలిపింది.  డిస్కౌంట్ ప్రకటించే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 3.59 లక్షల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కోసం అందుబాటులోకి తెచ్చిన వెబ్ సైట్లు క్రాష్ అయ్యాయి. దీంతో ఆ గడువును జనవరి 31 వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ అర్థరాత్రి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1.53 కోట్ల చలాన్లు క్లియర్ అయ్యాయి. ప్రభుత్వానికి 136 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. అదేవిధంగా వరంగల్‌‌‌‌ కమిషనరేట్‌‌‌‌కు రూ. 8.86 కోట్ల ఆదాయం సమకూరింది.

ఈక్రమంలోనే హైదరాబాద్ లోను కమిషన రేట్లు పరిధిలో కూడా భారీగానే ఆదాయం సమాకురింది. అయితే రేపటితో ట్రాఫిక్ పెండింగ్ చలాన్లకు ఇచ్చిన డిస్కౌంట్‌‌‌‌ ఆఫర్‌‌‌‌ ముగియనుంది. గతంలో రెండు సార్లు ఈ గడువును ప్రభుత్వం పొడిగించింది. గతంలో జనవరి 10 వ తేదీ వరకు ట్రాఫిక్ పెండింగ్ చలాన్లను డిస్కౌంట్‌తో కట్టొచ్చని ప్రభుత్వం ప్రకటించగా.. ఆ గడువును జనవరి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ గడువు కూడా  రేపటితో ముగియనుంది. మొత్తంగా ప్రభుత్వం రాయితీలు ప్రకటించినప్పటి నుంచి కొత్తగా ఫైన్లు విధించడం ఆపి చలాన్ల చెల్లింపులపై ఫోకస్‌‌‌‌ చేసి విజయం సాధించారు. చెల్లింపు కోసం మరో రెండు రోజులే మిగిలి ఉండడంతో పలు ప్రాంతాల్లో తనిఖీ చేస్తూ చలాన్లను క్లియర్‌‌‌‌ చేయిస్తున్నారు. ఇక రేపటి తో ఉన్న గడవును పెంచే ఆలోచనలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో పెండింగ్ చలాన్లు ఉన్న వారు రేపటి లోపు చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి