iDreamPost

Revanth Reddy: ఇళ్లు నిర్మించుకునే వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!

తెలంగాణ ప్రభుత్వం తరచూ వివిధ వర్గాల ప్రజలకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతూనే ఉంది. అలానే తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుని ఇళ్లను నిర్మించుకునే వారికి తీపి కబురు చెప్పింది. దీంతో ఇళ్ల నిర్మాణ ఖర్చులు తగ్గనున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం తరచూ వివిధ వర్గాల ప్రజలకు ఏదో ఒక గుడ్ న్యూస్ చెబుతూనే ఉంది. అలానే తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుని ఇళ్లను నిర్మించుకునే వారికి తీపి కబురు చెప్పింది. దీంతో ఇళ్ల నిర్మాణ ఖర్చులు తగ్గనున్నాయి.

Revanth Reddy: ఇళ్లు నిర్మించుకునే వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్!

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తరువాత పరిపాలనలో తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. ఆరు గ్యారెటీల అమలు దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు ముందుకు వేస్తుంది. మహిళలు ఉచిత బస్సు ప్రయాణం, 500లకే గ్యాస్ సిలిండర్ వంటి వాటితో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అలానే నిరుద్యోగులకు వివిధ నోటిఫికేషన్ లు విడుదల చేసిన తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా ఇళ్ల నిర్మాణం చేపట్టిన ప్రజలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓ శుభవార్త చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటోఇప్పుడు చూద్దాం..

ప్రతి ఒక్కరికి సొంతిళ్లు అనేది  ఓ కళ. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఇంటి నిర్మాణంకి అయ్యే ఖర్చులు బాగా పెరిగాయి. ఇలాంటి సమయంలోనే ఇళ్ల నిర్మాణం చేపట్టే వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పంది. గ్రామీణ ప్రాంతాల్లో సొంతిళ్లు నిర్మించుకునే వారికి ఈ శుభవార్తను తెలంగాణ ప్రభుత్వం అందించింది. ఇక నుంచి మీరు ఉచితంగా ఇసుకను తీసుకెళ్లవచ్చు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ ఇంటి నిర్మాణానికి, ప్రభుత్వ భవనాల నిర్మాణ పథకాలకు సమీపంలోని నదులు, వాగుల నుంచి ఇసుకను ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ఉంది. అయితే ఇసుక పాలసీ విధానం అమల్లో ఉన్న నల్గొండ తదితర జిల్లాల్లో ఉచితంగా తీసుకెళ్లే వెసులుబాటు ప్రస్తుతం అమలు కావడం లేదు. ప్రజలు తమ సొంత ఇళ్ల నిర్మాణాలకు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో ఇసుక తీసుకెళ్తుంటే పోలీసు, రెవెన్యూ ఇతర అధికారులు అడ్డుకుంటున్నారు. అంతేకాక అలా ఇసుకు తీసుకెళ్తున్న ప్రజలకు జరిమానాలు విధిస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. వాటిని పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్పందించి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నదులు, ఉపనదులు, వాగుల నుంచి సీనరేజి రుసుం కట్టకుండానే ఇసుకను ఫ్రీగా తీసుకెళ్లవచ్చునని పేర్కొంది.

ఏవైనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు గనులశాఖ ముఖ్యకార్యదర్శి బెన్హర్‌ మహేశ్‌దత్‌ ఎక్కా మార్చి 23 శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ ఇసుక తవ్వకాల నిబంధనలు-2015ను అమలు చేయాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టే పేదలకు  ఇంటి నిర్మాణ ఖర్చులు తగ్గనున్నాయి. మరి.. ఇసుక విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి