iDreamPost

రేషన్ కార్డు దారులకు అలెర్ట్.. మరో అవకాశం కల్పించిన తెలంగాణ సర్కార్!

Ration Card E-KYC: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా ఈకేవైసీని తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రేషన్‌ కార్డుల విషయంలో ఈ-కేవైసీ నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికి ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

Ration Card E-KYC: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా ఈకేవైసీని తీసుకొచ్చిన సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే రేషన్‌ కార్డుల విషయంలో ఈ-కేవైసీ నమోదుకు తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికి ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.

రేషన్ కార్డు దారులకు అలెర్ట్.. మరో అవకాశం కల్పించిన తెలంగాణ సర్కార్!

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాయి. అయితే ఏ స్కీమ్స్ లో కొన్ని కొన్ని అవకతవకలు జరుగుతుంటాయి. కొందరు అవినీతి పరులు ప్రజలకు అందాల్సిన పథకాలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ట చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా పేదాలకు అందించే రేషన్ పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డులు ఉన్నవారు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఇప్పటికే పలుసార్లు ప్రభుత్వం ఈ అంశంపై గడువును పెంచుతూ వచ్చింది. తెలంగాణ సర్కార్ ఈ కేవైసీ విషయంలో  రేషన్ కార్డు దారులకు మరో అవకాశం ఇచ్చింది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అర్హులైన వారికి అందించాలని ఈకేవైసీని ప్రవేశపెట్టారు. పేదలకు అందాల్సిన రేషన్ సరుకులు అర్హులకే అందే విధంగా కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే రేషన్‌ కార్డులకు ఈ కేవైసీ తప్పనిసరి చేసింది. ఇందుకోసం ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు సైతం చేపట్టారు. రేషన్ కార్డు దారులు తమ సమీపంలో ఉన్న రేషన్‌ షాపుకు వెళ్లి ఈ-కేవైసీ చేసుకోవాలని పౌరసరఫరాల అధికారులు ప్రజలకు సూచించారు.

ఇక ఈకేవైసీ చేయించే సమయంలో వేలి ముద్రల ఆధారంగా రేషన్ కార్డుదారులను నిర్ధారిస్తారు. అలానే రేషన్ సప్లయ్ చేసే సమయంలో తీసుకునే వ్యక్తి కుటుంబంలో సభ్యుడా? కాదా? అనే విషయాలను ఈకేవైసీ ద్వారా గుర్తించనున్నారు. ఆ విధంగా రేషన్ బియ్యం సహా ప్రభుత్వం ఇచ్చే ఇతర సరుకులు సక్రమంగా అర్హులకు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈకేవైసీ అనేది ఎప్పటి నుంచో  చేస్తున్నారు. అయితే వేలిముద్రలు పడక, టెక్నికల్ ఇష్యూతో ఆలస్యం జరుగుతోంది.  అలానే చిన్నారుల విషయంలో వారి ఆధార్ కార్డులు అప్డేట్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తున్నాయి అధికారులు చెబుతున్నారు. అలానే పలువురు వృద్ధుల వేలిముద్రలు సైతం పడటం లేదు. మీసేవా, ఆధార్‌ సెంటర్లకు వెళ్లి అప్టేట్ పూర్తి చేసుకున్నా ఈ-కేవైసీ ప్రక్రియలో వేలిముద్రలు రావడం లేదు.

ఇలా వివిధ కారణాలతో చాలా మంది ఇప్పటికి ఈ కేవేసీ పూర్తి చేసుకోలేదు.  అయితే రేషన్ కార్డు కలిగిన వారిలో 74.6 శాతం మాత్రమే ఇప్పటి వరకు నమోదు చేసుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డు ఉన్న వారికి ఈకేవైసీ నమోదుకు తెలంగాణ సర్కార్ మరో అవకాశం కల్పించింది. రేషన్ షాపుల్లో ఇంకా  ఈ కేవైసీ ప్రక్రియ కొనసాగుతూనే ఉందని అధికారులు చెపుతున్నారు. రేషన్ కార్డు దారులు తమ సమీపంలోని రేషన్‌ డీలర్ల వద్దకు వెళ్లి ఈ కేవైసీ పూర్తి చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రభుత్వం తుది గడువు విధించలేదని, అయితే విధించేలోపు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని చెబుతున్నారు. మరి.. ఈకేవైసీపీ విషయంలో తెలంగాణ సర్కార్ ఇచ్చిన వెసులుబాటుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి