iDreamPost

YSRTPకి గుర్తు కేటాయించిన ఈసీ.. షర్మిల అసంతృప్తి!

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల గురించి చర్చలు నడుస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు కొత్త పార్టీలు కూడా పోటీ చేయబోతున్నాయి

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల గురించి చర్చలు నడుస్తున్నాయి. ఈసారి ఎన్నికల్లో ప్రధాన పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలతో పాటు కొత్త పార్టీలు కూడా పోటీ చేయబోతున్నాయి

YSRTPకి గుర్తు కేటాయించిన ఈసీ.. షర్మిల అసంతృప్తి!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఇటీవల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో ప్రధాన పార్టీ నేతల్లో హడావుడి మొదలైంది. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లు ఖారారు చేసి బీ-పారాలు కూడా ఇచ్చేసింది. ఇక ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ తమ అభ్యర్థుల జాబితా విషయంలో తలమునకలు అవుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కైవసం చేసుకొని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ పార్టీ గట్టి పట్టుమీదే ఉంది. ఇక ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీ సైతం ఈసారి అధికార పార్టీని ఎలాగైనా గద్దె దించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ కూతురు వైఎస్ షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన విషయం తెలిసిందే. తొలిసారి ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆమెకు ఎన్నికల సంఘం ఓ గుర్త కూడా కేటాయించింది. వివరాల్లోకి వెళితే..

2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ టీపీ పేరుతో తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు  పెట్టింది వైఎస్ షర్మిల. నాటి నుంచి అధికార పార్టీని టార్గెట్ చేసుకొని ఎన్నో విమర్శలు చేస్తూ వస్తున్నారు. పాదయాత్ర, ధర్నాలు, ర్యాలీలతో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తొలిసారిగా 119 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె పార్టీ తరుపు నుంచి పోటీ చేయబోయేవారికి కేంద్ర ఎన్నికల సంఘం ‘బైనాక్యులర్’ గుర్తును కేటాయించారు. 119 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి గుర్తుగా బైనాక్యులర్ గుర్తు కేటాయిస్తూ గురువారం ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వైఎస్ఆర్ టిపికి పర్మినెంట్ సింబల్ రాలేదు. తమకు బైనాక్యులర్ గుర్తు కేటాయించడంపై వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ గుర్తు కేటాయించడం వల్ల పార్టీ అభ్యర్థులు నష్టపోయే అవకాశం ఉందని ఆమె అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ గుర్తు బైనాక్యులర్ కాకుండా మరో గుర్తు కేటాయించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఈసీ తమకు కేటాయించిన గుర్తుపై ఆ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరి దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇటీవల వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయాలని షర్మిల ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం గతంలో పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ లతో భేటీ అయ్యారు.. నాలుగు నెలలు గడిచినా ఎలాంటి స్పందన రాకపోవడంతో ఇక లాభం లేదని ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు షర్మిల సిద్ద పడ్డారని వార్తలు వస్తున్నాయి. మొదటి నుంచి ఖమ్మం నియోజకవర్గంపై దృష్టి సారిస్తూ వచ్చిన షర్మిల పాలేరు నుంచి బరిలోకి దిగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరీ ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ఎన్ని సీట్లు గెలుస్తాయో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి