iDreamPost

పట్టాలు తప్పిన తేజస్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు.. పలువురి గాయాలు!

Tejas Express Derailed: ఇటీవల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలసిందే. సాంకేతిక లోపాలు, పట్టాలు తప్పడం, మానవ తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

Tejas Express Derailed: ఇటీవల తరుచూ రైలు ప్రమాదాలు జరుగుతున్న విషయం తెలసిందే. సాంకేతిక లోపాలు, పట్టాలు తప్పడం, మానవ తప్పిదాల వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి.

పట్టాలు తప్పిన తేజస్ ఎక్స్‌ప్రెస్ కోచ్‌లు.. పలువురి గాయాలు!

ప్రతిరోజూ భారతీయ రైల్వేలో లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు రైలు ప్రయాణాలు చేయడానికి ఇష్టపడుతుంటారు. బస్సు టికెట్ కన్నా రైలు టికెట్ ధరలు తక్కువే కాదు.. సురక్షితం. రైల్లో ఎన్నో సౌకర్యాలు ఉంటాయి.. అందుకే ప్రతిరోజూ లక్షల సంఖ్యల్లో విద్యార్ధులు, ఉద్యోగులు, చిరువ్యాపాలు ఇతర పనులపై వెళ్లేవారు ప్రయాణిస్తుంటారు. ఇదిలా ఉంటే ఇటీవల తరుచూ రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తేజస్ ఎక్స్ ప్రెస్ కోచ్ లు పట్టాలు తప్పాయి. వివరాల్లోకి వెళితే..

ఘజియాబాద్ లో ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. తేజస్ ఎక్స్ ప్రెస్ కోచ్ లు పట్టాలు తప్పడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయాలు అయ్యాయి. అదృష్టం కొద్ది పట్టాలు తప్పిన సమయంలో రైలు వేగం తక్కవగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకు అధికారులు అక్కడికి చేరుకొని చర్యలు చేపట్టారు. భువనేశ్వర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న తేజస్ ఎక్స్ ప్రెస్ ఘజియాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగానే పట్టాలు తప్పింది.

ఈ సంఘటన నాల్గోవ నెంబర్ ఫ్లాట్ ఫామ్ సుమారు 100 మీటర్లు ముందు జరిగింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పట్టాలు తప్పిన కోచ్ లోని ప్రయాణికులను లగేజి కంపార్ట్ మెంట్ వెనుక ఉన్న మరో కోచ్ కి వెంటనే తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి