iDreamPost

Teja Sajja: ఈ చోటా ‘హనుమాన్‌’ వంద కోట్లు మోసేనా?

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'హనుమాన్‌' సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఆలస్యం అవుతున్న కారణంగానే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీఎఫ్‌ఎక్స్‌ కి భారీ బడ్జెట్‌ కేటాయిస్తూ ఏకంగా సినిమా బడ్జెట్‌ ని రూ.100 కోట్లకు పెంచేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

తేజ సజ్జ హీరోగా ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న 'హనుమాన్‌' సినిమాను వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. వీఎఫ్‌ఎక్స్ వర్క్‌ ఆలస్యం అవుతున్న కారణంగానే ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. వీఎఫ్‌ఎక్స్‌ కి భారీ బడ్జెట్‌ కేటాయిస్తూ ఏకంగా సినిమా బడ్జెట్‌ ని రూ.100 కోట్లకు పెంచేశారు అంటూ వార్తలు వస్తున్నాయి.

Teja Sajja: ఈ చోటా ‘హనుమాన్‌’ వంద కోట్లు మోసేనా?

భాష ఏదైనా హిందుత్వంను జోడిస్తే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగి సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఈ విషయం ఇప్పటి వరకు వచ్చిన పలు సినిమాలు కన్ఫర్మ్‌ చేశాయి. ఆదిపురుష్‌ సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా సరే భారీ వసూళ్లు సాధించిన విషయం తెల్సిందే. అందుకే తేజ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న హనుమాన్ సినిమా విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హనుమాన్‌ కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా ను ఎప్పుడో విడుదల చేయాల్సి ఉంది. కానీ టీజర్ విడుదల తర్వాత సినిమాకు పాన్‌ ఇండియా రేంజ్ లో మంచి స్పందన దక్కింది. సినిమా గురించి బాలీవుడ్‌ వాళ్లు కూడా చర్చించుకోవడం మొదలు పెట్టారు. అందుకే హనుమాన్‌ ను పాన్‌ ఇండియా మూవీగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్.

ఈ క్రమంలోనే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హనుమాన్ సినిమా ను మెుదట రూ.40 కోట్ల బడ్జెట్‌ తో పూర్తి చేయాలి అనుకున్నారు. అందుకు తగ్గట్లుగానే దర్శకుడు ప్రశాంత్‌ వర్మ షూటింగ్ పూర్తి చేశాడు. అయితే టీజర్ కు వచ్చిన అనూహ్య స్పందన నేపథ్యంలో పాన్ ఇండియా రేంజ్ లో మంచి బిజినెస్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే సినిమా వీఎఫ్ఎక్స్‌ కోసం భారీ ఎత్తున ఖర్చు చేయాలని దర్శకుడు నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికోసం అంతర్జాతీయ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ సంస్థలతో హనుమాన్‌ కి వర్క్‌ చేయిస్తున్నాడట. అంతే కాకుండా కొన్ని షాట్స్ ని రీ షూట్‌ చేసి భారీగా కనిపించేలా డిజైన్‌ చేశాడట. మొత్తానికి హనుమాన్‌ ను రూ.40 కోట్ల నుంచి రూ.100 కోట్ల సినిమాగా మార్చాడు.

hanuman movie target 100 crores

హీరోగా తేజ సజ్జ ఇప్పటి వరకు చేసిన సినిమాలు చిన్న బడ్జెట్‌ సినిమాలే.. ఇక దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కూడా ఓ భారీ కమర్షియల్‌ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్ లను అందుకోలేదు. అయినా కూడా ఈ హనుమాన్‌ పై వంద కోట్లు పెట్టుబడి పెట్టడం అంటే మామూలు విషయం కాదు. సినిమాలో కంటెంట్‌ ఉంటే హీరో ఎవరు అనే విషయాన్ని జనాలు చూడరు. కనుక హనుమాన్‌ కంటెంట్‌ పై నమ్మకంతో వంద కోట్లు పెడుతున్నట్లుగా మేకర్స్ చెప్పుకొస్తున్నారట. సినిమాకు ఉన్న బజ్ నేపథ్యంలో ఈజీగా వంద కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక విడుదలకు ముందే నిర్మాతలు లాభాలు పొందవచ్చు. మూవీకి ఏమాత్రం హిట్‌ టాక్‌ వచ్చినా కూడా వందల కోట్ల వసూళ్లు, భారీ ఎత్తున నాన్‌ థియేట్రికల్‌ రైట్స్ కి బిజినెస్ జరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. మరి చిన్న బడ్జెట్‌ సినిమాగా మొదలైన హనుమాన్‌ వంద కోట్ల సినిమాగా మారడం, అంత భారం హనుమాన్‌ మోసేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి