iDreamPost
android-app
ios-app

నువ్వు పెద్ద బాహుబలి తీసాననుకుంటున్నావా? బలగం వేణుకి అవమానం

  • Published Apr 20, 2024 | 5:54 PM Updated Updated Apr 20, 2024 | 5:54 PM

అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ డైలాగ్ బలగం వేణుకి కరెక్ట్ గా సూటవుతుంది. బలగం మూవీతో అద్భుతం సృష్టించిన వేణుని ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ కొడుతుందని ఓ టెక్నీషియన్ ఊహించలేకపోయాడు. వేణుని ఇన్సల్ట్ చేశాడు.

అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు. జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరం లేదు. ఈ డైలాగ్ బలగం వేణుకి కరెక్ట్ గా సూటవుతుంది. బలగం మూవీతో అద్భుతం సృష్టించిన వేణుని ఆ సినిమా అంత పెద్ద సక్సెస్ కొడుతుందని ఓ టెక్నీషియన్ ఊహించలేకపోయాడు. వేణుని ఇన్సల్ట్ చేశాడు.

నువ్వు పెద్ద బాహుబలి తీసాననుకుంటున్నావా? బలగం వేణుకి అవమానం

జై సినిమాతో కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వేణు.. అనేక సినిమాల్లో నటించి తనదైన హాస్యంతో నవ్వించారు. ఆ తర్వాత జబర్దస్త్ షో ద్వారా నవ్వుల పువ్వులు పూయించి జబర్దస్త్ వేణుగా పేరు తెచ్చుకున్నారు. చాలా కాలం తర్వాత బలగం వంటి మాంచి ఎమోషనల్ మూవీ తీసి బలగం వేణుగా మారారు. డైరెక్టర్ గా మొదటి సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. అయితే ఎంత పెద్ద సక్సెస్ వచ్చినా కానీ అదొచ్చే ముందు అవమానాలు అనేవి రావడం సహజం. అద్భుతం జరిగే ముందు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం లేదు అని త్రివిక్రమ్ చెప్పినట్టు వేణు చేయబోయే అద్భుతాన్ని ఆ టెక్నీషియన్ గుర్తించలేదు. బలగం సినిమా తీస్తుంటే బాహుబలి తీసినట్టు ఫీలవ్వకు అంటూ వేణుని ఇన్సల్ట్ చేశాడో టెక్నీషియన్. ఆ సమయంలో వేణు చాలా బాధపడ్డారట. ఈ విషయాన్ని అలీతో సరదాగా షోలో వెల్లడించారు. ఈ షోలో బలగం వేణుతో పాటు కమెడియన్ ధనరాజ్ కూడా పాల్గొన్నారు.

టెక్నీషియన్స్ తో డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఆ టెక్నీషియన్ బలగం వేణుని అవమానించాడట. పెద్ద బాహుబలి తీసినట్టు ఫీలవుతున్నావ్ నువ్వు అని అన్నాడట. ఆ తర్వాత అలీ వచ్చి బలగం ఈవెంట్ లో ఈ సినిమాని బాహుబలి మూవీతో పోల్చారు. ఆ విషయాన్ని వేణు ఈ షోలో ప్రస్తావించారు. చిన్న సినిమాల్లో బలగం మూవీ బాహుబలి అని అలీ అన్నారు. ఈ విషయాన్ని బలగం వేణు గుర్తుచేసుకున్నారు. ఇంకా ఈ షోలో వేణు చాలా విషయాలు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ప్రోమోలో నేచురల్ స్టార్ నానితో బలగం వేణు భారీ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే అధికారికంగా ఆ హీరో నుంచి వస్తేనే బాగుంటుందని అన్నారు. ఇక బలగం సినిమా విషయానికొస్తే.. ఈ మూవీ ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పించింది. ఈ మూవీలో చూపించిన బంధాలు, భావోద్వేగాలు అందరినీ ఆలోచింపజేశాయి.

ఈ సినిమా తీసిన వేణుకి సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు దక్కాయి. పలు అవార్డులు కూడా ఈ సినిమాకి రావడం విశేషం. ఒకానొక సమయంలో జబర్దస్త్ లో ఓ స్కిట్ చేసి దెబ్బలు తిన్న వేణు.. అదే జనాలతో శభాష్ అనిపించుకునేలా బలగం వంటి సినిమా తీశారు. ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో మరో వండర్ కి శ్రీకారం చుట్టారు. జబర్దస్త్ లో వండర్స్ వేణుగా ఉన్న బలగం వేణు నిజంగానే వండర్స్ క్రియేట్ చేస్తూ వండర్స్ వేణు పేరుకి న్యాయం చేస్తున్నారు. బలగం వేణు తన బలగం పెంచుకుంటూ అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించాలని కోరుకుందాం. ఈ క్రమంలో ఎదురయ్యే అవమానాలను తన చిత్రాలే సమాధానం చెబుతాయి. మరి బాహుబలి తీశానని ఫీలవుతున్నావా అన్న టెక్నీషియన్ కి వినపడేలా.. అలీతో చిన్న సినిమాల్లో ఇది బాహుబలి అని అనిపించేలా బలగం సినిమాని తెరకెక్కించిన వేణుపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet Giriş