iDreamPost

Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ రేర్ టాలెంట్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాచావ్ బాస్!

  • Published Jan 16, 2024 | 7:17 PMUpdated Jan 16, 2024 | 7:17 PM

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ టాలెంట్ గురించి తెలిసిందే. అయితే అతడిలో మరో ప్రతిభ కూడా ఉందనేది చాలా మందికి తెలియదు.

టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ బౌలింగ్ టాలెంట్ గురించి తెలిసిందే. అయితే అతడిలో మరో ప్రతిభ కూడా ఉందనేది చాలా మందికి తెలియదు.

  • Published Jan 16, 2024 | 7:17 PMUpdated Jan 16, 2024 | 7:17 PM
Kuldeep Yadav: కుల్దీప్ యాదవ్ రేర్ టాలెంట్.. ఇన్నాళ్లూ ఎక్కడ దాచావ్ బాస్!

కుల్దీప్ యాదవ్.. క్రికెట్​కు భారత జట్టు అందించిన మరో మంచి స్పిన్నర్. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్ లాంటి బలమైన స్పిన్నర్లతో ఉన్న తీవ్ర పోటీని తట్టుకొని జట్టులో చోటును సుస్థిరం చేసుకున్నాడు కుల్దీప్. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సూపర్బ్​గా యూజ్ చేసుకున్నాడు. ఆ జట్టు, ఈ జట్టు అనే తేడాల్లేకుండా ప్రతి ప్రత్యర్థిపై వికెట్లు తీస్తూ టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంజ్యురీ తర్వాత నుంచి అతడు ఆడుతున్న తీరు అద్భుతమనే చెప్పాలి. బెంగళూరులోని ఎన్​సీఏలో ఉన్నప్పుడు తన బలహీనతల మీద ఫోకస్ పెట్టాడు. రనప్, స్పీడ్, వేరియేషన్స్ విషయంలో బాగా సాధన చేశాడు. ఆసియా కప్-2023 నుంచి అతడి డామినేషన్ మొదలైంది. మణికట్టు మాయాజాలంతో అపోజిషన్ టీమ్ బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు కుల్దీప్. వన్డే వరల్డ్ కప్-2023లోనూ సత్తా చాటిన కుల్దీప్​లో బౌలింగ్​తో పాటు మరో రేర్ టాలెంట్ కూడా దాగి ఉంది.

కుల్దీప్ అద్భుతమైన క్రికెటరే కాదు.. మంచి పెయింటర్ కూడా. బొమ్మలు గీయడంలో అతడు ఆరితేరాడు. అయితే ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చింది. త్వరలో అయోధ్యలో భవ్య రామమందిరం ప్రారంభోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతటా రామనామస్మరణ వినిపిస్తోంది. ఈ తరుణంలో రాముడితో పాటు హనుమంతుడి ఫొటోలను తన కుంచెతో గీశాడు కుల్దీప్. ఆగ్రహంగా ఉన్న ఆంజనేయుడు, చేతిలో విల్లుతో ఉన్న శ్రీరాముడి చిత్రాలను గీశాడీ భారత స్పిన్నర్. ఈ పెయింటింగ్స్​ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. ఇవి చూసిన ఫ్యాన్స్ నీ టాలెంట్ సూపర్ బాస్ అంటున్నారు. ఇన్నాళ్లూ ఈ ప్రతిభను ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. కుల్దీప్ మరిన్ని పెయింటింగ్స్ వేయాలని కోరుకుంటున్నారు.

కుల్దీప్ టాలెంట్ అద్భుతమని సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అతడి పెయింటింగ్స్ చూస్తుంటే మతి పోతోందని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇక, వికెట్ల వేటలో ఎప్పుడూ ముందుండే కుల్దీప్.. దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. త్వరలో ఇంగ్లండ్​తో స్వదేశంలో జరిగే 5 టెస్టుల సిరీస్​లోనూ తన తడాఖా చూపించాలని అనుకుంటున్నాడు. అలాగే ఐపీఎల్​లోనూ రాణించి టీ20 వరల్డ్ కప్​-2024లో ఆడే భారత జట్టులో తన ప్లేస్ పదిలం చేసుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అయితే మరో యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ నుంచి కుల్దీప్​కు తీవ్ర పోటీ నెలకొంది. బిష్ణోయ్​తో పాటు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్​ల రూపంలో పలువురు స్పిన్ ఆల్​రౌండర్లు అందుబాటులో ఉండటంతో పొట్టి ఫార్మాట్​లో జరిగే ప్రపంచ కప్​లో అతడ్ని ఆడిస్తారో లేదో అనుమానంగా మారింది. మరి.. కుల్దీప్ పెయింటింగ్ టాలెంట్​పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Rohit Sharma: ఆ విషయంలో ధోనీని రోహిత్ ఫాలో అవుతున్నాడు.. అందుకే ఇంత సక్సెస్: రైనా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి