iDreamPost

Rohit Sharma: ఆ విషయంలో ధోనీని రోహిత్ ఫాలో అవుతున్నాడు.. అందుకే ఇంత సక్సెస్: రైనా

  • Published Jan 16, 2024 | 4:44 PMUpdated Jan 16, 2024 | 4:44 PM

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సక్సెస్​కు లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కారణమని సురేష్ రైనా అన్నాడు. ఓ విషయంలో మాహీని ఫాలో అవడం వల్లే హిట్​మ్యాన్ సారథిగా ఇంత విజయవంతం అవుతున్నాడని చెప్పాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సక్సెస్​కు లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని కారణమని సురేష్ రైనా అన్నాడు. ఓ విషయంలో మాహీని ఫాలో అవడం వల్లే హిట్​మ్యాన్ సారథిగా ఇంత విజయవంతం అవుతున్నాడని చెప్పాడు.

  • Published Jan 16, 2024 | 4:44 PMUpdated Jan 16, 2024 | 4:44 PM
Rohit Sharma: ఆ విషయంలో ధోనీని రోహిత్ ఫాలో అవుతున్నాడు.. అందుకే ఇంత సక్సెస్: రైనా

ఇటీవల కాలంలో టీమిండియా వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫైనల్​ను పక్కనబెడితే మిగతా అన్ని టోర్నీల్లోనూ భారత్ ఫుల్ డామినేషన్ కనబరిచింది. ప్రపంచ కప్​లోనూ ఒక్క ఫైనల్ మ్యాచ్​లో తప్పితే లీగ్ దశ నుంచి సెమీస్ వరకు రోహిత్ సేన విజృంభించి ఆడింది. బ్యాట్స్​మెన్​గా అదరగొడుతున్న హిట్​మ్యాన్.. కెప్టెన్సీలోనూ తనదైన మార్క్ చూపిస్తున్నాడు. టీమ్ అవసరాలకు తగ్గట్లు సరైన సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటూ జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. టాలెంట్ ఉన్న యంగ్​స్టర్స్​కు అండగా నిలబడుతున్నాడు. అందుకే శుబ్​మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబె, ముకేశ్ కుమార్ లాంటి యంగ్​స్టర్స్​ అద్భుతంగా రాణిస్తున్నారు. దీని మీద భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా స్పందించాడు. సారథిగా రోహిత్ ఇంతగా సక్సెస్ అవడానికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని ఫాలో అవడమే కారణమన్నాడు.

ప్రస్తుత భారత క్రికెట్ టీమ్ ఇంత పటిష్టంగా మారడానికి రోహిత్ శర్మే కారణమని చెప్పాడు రైనా. ఇది అతడి జట్టు అన్నాడు. హిట్​మ్యాన్ ఇస్తున్న ఎంకరేజ్​మెంట్ వల్లే దూబె లాంటి వారు రాణిస్తున్నారని మెచ్చుకున్నాడు. ‘ఇది పూర్తిగా రోహిత్ శర్మ టీమ్. జట్టులోని ప్లేయర్లు అందరూ ఫుల్ ఫామ్​లో ఉన్నారు. ముఖ్యంగా దూబె అద్భుతంగా ఆడుతున్నాడు. ఆఫ్ఘానిస్థాన్​తో సిరీస్ మాత్రమే కాదు ఈ సీజన్ మొత్తం అతడు రాణిస్తూ వచ్చాడు. గత ఐపీఎల్​లో చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. సీఎస్​కే కెప్టెన్ ధోని తనను నమ్మే స్థాయికి ఎదిగాడతను. ధోనీలాగే రోహిత్ కూడా దూబె మీద నమ్మకం ఉంచడం వల్లే అతడు కన్​సిస్టెంట్​గా రన్స్ చేస్తున్నాడు’ అని రైనా చెప్పుకొచ్చాడు. తన టీమ్​లోని యంగ్​స్టర్స్ మీద ధోని నమ్మకం ఉంచుతాడని.. అదే పని ఇప్పుడు హిట్​మ్యాన్ కూడా చేసి సక్సెస్ అవుతున్నాడని పేర్కొన్నాడు.

సెకండ్ టీ20లో బ్యాట్లతో ఆఫ్ఘాన్​పై విరుచుకుపడిన జైస్వాల్, దూబేను పొగడ్తల్లో ముంచెత్తాడు రైనా. వాళ్లు చాలా పాజిటివ్​గా ఆడారని తెలిపాడు. అటాకింగ్ బ్యాటింగ్​తో ప్రయోజనం పొందారన్నాడు. ‘జైస్వాల్-దూబె సానుకూలంగా ఆడారు. అటాకింగ్ అప్రోచ్​తో అలవోకగా పరుగులు రాబట్టారు. వాళ్లిద్దరి బ్యాట్ స్వింగ్ బాగుంది. బాల్​ను చక్కగా మిడిల్ చేస్తున్నారు. దీని వల్ల బాల్ ఈజీగా బౌండరీ దాటుతోంది. ఇదంతా ప్రాక్టీస్ చేయడం వల్లే సాధ్యం. భయాన్ని దరిచేరనీయకుండా పాజిటివ్​ మైండ్​సెట్​తో ఆడటం మంచి విషయం. ఇది మన జట్టు బలం ఏంటో చాటుతోంది’ అని రైనా వ్యాఖ్యానించాడు. టీ20 వరల్డ్ కప్​-2024కు ముందు జట్టు ప్లేయర్లు అంతా ఫామ్​లోకి రావడం చాలా అవసరం అని వివరించాడు. ఇక ఆఫ్ఘాన్​తో సిరీస్​ను మరో టీ20 ఉండగానే కైవసం చేసుకుంది భారత్. ఈ సిరీస్​లో ఆఖరి మ్యాచ్ బుధవారం చెన్నైలోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. మరి.. రోహిత్ సక్సెస్ గురించి రైనా చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: కేదార్ జాదవ్ గుర్తున్నాడా? భారీ స్కోర్ సాధించినా అవమానం!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి