iDreamPost

మరో యువరాజ్ పుడితేనే మనకి వరల్డ్ కప్! ఆ ఒక్కడే స్పెషల్!

  • Published Nov 20, 2023 | 6:39 PMUpdated Nov 21, 2023 | 11:28 AM

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టోర్నీ మొత్తం ఎంతో అద్భుతంగా ఆడిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో మాత్రం పరాజయం చవిచూసింది. టోర్నీ ఆసాంతం ఒక్క లోపం కూడా లేకుండా కనిపించిన టీమిండియాలో.. ఫైనల్లో మాత్రం పెద్ద లోటు ఉందని బయటపడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో టోర్నీ మొత్తం ఎంతో అద్భుతంగా ఆడిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో మాత్రం పరాజయం చవిచూసింది. టోర్నీ ఆసాంతం ఒక్క లోపం కూడా లేకుండా కనిపించిన టీమిండియాలో.. ఫైనల్లో మాత్రం పెద్ద లోటు ఉందని బయటపడింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Nov 20, 2023 | 6:39 PMUpdated Nov 21, 2023 | 11:28 AM
మరో యువరాజ్ పుడితేనే మనకి వరల్డ్ కప్! ఆ ఒక్కడే స్పెషల్!

వరల్డ్‌ కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఓటమితో భారత క్రికెట్‌ అభిమానుల్లో నిరాశ ఆవహించింది. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైనా ఓటమి ఆటగాళ్లతోనే కాదు ప్రతి ఇండియన్‌ క్రికెట్‌ అభిమాని చేత కన్నీళ్లు పెట్టించింది. మ్యాచ్‌ ముగిసి 24 గంటలు దాటుతున్నా.. ఇంకా చాలా మంది ఓటమి బాధ నుంచి బయటపడలేదు. టోర్నీ మొత్తం ఎంతో అద్భుతంగా ఆడిన రోహిత్‌ సేన.. ఓటమి ఎరుగని జట్టుగా ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. కానీ, వరల్డ్‌ కప్‌కు ఒక్క అడుగు దూరంలో చతికిలపడింది. ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. జట్టు ఎంతో పటిష్టంగా ఉన్నా.. టీమ్‌లోని ప్రతి ప్లేయర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నా.. టీమిండియా కప్పు గెలవలేకపోయింది. దీంతో.. మరోసారి క్రికెట్‌ అభిమానుల్లో టీమిండియా మాజీ స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ గురించి చర్చ జరుగుతోంది.

యువరాజ్‌ సింగ్‌ లాంటి మేటి ఆల్‌రౌండర్‌ను టీమిండియా మిస్‌ అయిందని.. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మిగతా మ్యాచ్‌ల్లో ఒక నిఖార్సయిన ఆల్‌రౌండర్‌ అవసరం ఏంటో టీమిండియాకు అర్థం కాలేదని, కానీ, అసలు సిసలు సమరంలో ఒక్కసారిగా బౌలర్లు విఫలమైన చోట.. యువరాజ్‌సింగ్‌ లాంటి ఆల్‌రౌండర్‌ ఉంటే ఎంత బాగుడేందో అని అనుకుంటున్నారు చాలా మంది క్రికెట్‌ అభిమానులు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపో​యింది. జట్టులో ఐదుగురు నిఖార్సయిన బౌలర్లు, ఆరుగురు స్పెషలిస్ట్‌ బ్యాటర్లతో ఆడిన టీమిండియా ఏకంగా ఫైనల్‌లోనే మూల్యం చెల్లించుకుంది. పిచ్‌ నుంచి మద్దతు లేనప్పుడు.. బౌలర్లు టార్గెట్‌ చేసి కొడుతున్నప్పుడు.. యువీ లాంటి ఒక వికెట్‌ టేకింగ్‌ ఆల్‌రౌండర్‌ జట్టులో ఉంటే ఫలితం వేరేలా ఉండేది.

2011 వన్డే వరల్డ్‌ కప్‌లో యువరాజ్‌ సింగ్‌ అదే చేసి చూపించాడు కూడా. ఆ వరల్డ్‌ కప్‌ను టీమిండియా గెలిచిందంటే యువరాజ్‌ సింగ్‌ వల్లే. ఒక ఆల్‌రౌండర్‌గా జట్టు విజయాల్లో వెన్నుముకగా నిలిచాడు. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌ రెండు విభాగాల్లోనూ జట్టుకు తోడ్పాటు అందించాడు. బ్యాట్‌తోనే కాదు.. యువీ బౌలింగ్‌తో కూడా గెలిపించిన మ్యాచ్‌లు ఉన్నాయి ఆ వరల్డ్‌ కప్‌లో. యువీ ఒక్కడే కాదు.. సచిన్‌, రైనా, సెహ్వాగ్‌ సైతం పార్ట్‌టైమ్‌ బౌలర్లుగా కొన్ని ఓవర్లు వేసే వారు. కానీ, ఇప్పుడు భారత జట్టులో ఆ పరిస్థితి లేదు. నెదర్లాండ్స్‌ మీద ఏదో ప్రేక్షకులను సంతోషపెట్టడానికి రోహిత్ శర్మ, కోహ్లీ, గిల్‌, సూర్యుకుమార్‌ యాదవ్‌ బౌలింగ్‌ చేసినట్టు ఉంది కానీ, మెయిన్‌ బౌలర్లుకు సపోర్ట్‌గా వేసినట్లు లేదు.

ఫైనల్లో టీమిండియా విజయావకాశాలు దెబ్బతినడానికి ప్రధాన కారణం యువీ లాంటి ఆల్‌రౌండర్‌ టీమ్‌లో లేకపోవడమే. ఉన్న ఒక్క నిఖార్సయిన ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా అయితే గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. అప్పటి నుంచి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సూర్య కుమార్‌యాదవ్‌ను జట్టులో కొనసాగిస్తున్నాడు. సూర్య పెద్దగా రాణించకపోయినా.. జట్టు విజయాలు సాధిస్తుందని అదే టీమ్‌ను కొనసాగించాడు. ఫైనల్లో దెబ్బ తిన్నాడు. ఇదే ఓటమి టోర్నీ మధ్యలోనే వచ్చి ఉన్నా.. టీమిండియా కాస్త జాగ్రత్త పడేది. కానీ, జట్టులోని పెద్ద లోపం ఏకంగా ఫైనల్‌ మ్యాచ్‌లో బయటపడ్డంతో ఎవరూ ఏమీ చేయలేకపోయారు. అయితే.. ఈ ఓటమితో యువరాజ్‌ సింగ్‌ టీమిండియా ఏం చేశాడో, అతను ఎంత గొప్ప ఆటగాడో ఇప్పుడు చాలా మందికి అర్థమై ఉంటుంది. 2011 వరల్డ్‌ కప్‌ సమయంలో క్యాన్సర్‌తో బాధపడుతూ.. గ్రౌండ్‌లో నెత్తురు కక్కుకున్నా.. దేశం కోసం ఆడి.. వరల్డ్‌ కప్‌ అందించాడు. ఆ వరల్డ్‌ కప్‌లో యువీనే ప్లేయర్‌ ఆఫ్‌ ది టోర్నమెంట్‌గా నిలిచారు. మరి ఇప్పుడు టీమిండియా యువీ లాంటి ప్లేయర్‌ లోటు ఉందంటే? మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి