iDreamPost

Sourav Ganguly: ఆ ప్లేయర్ ఆట చూడటం నా అదృష్టం.. అతడి పరుగుల ఆకలి తీరనిది: గంగూలీ

ఓ భారత స్టార్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ. అతడి ఆటని చూడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

ఓ భారత స్టార్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ. అతడి ఆటని చూడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Sourav Ganguly: ఆ ప్లేయర్ ఆట చూడటం నా అదృష్టం.. అతడి పరుగుల ఆకలి తీరనిది: గంగూలీ

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాంటింగ్, బ్రియన్ లారా, రాహుల్ ద్రవిడ్, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ ఇలా చెప్పుకుంటూ పోతే.. పెద్ద లిస్టే అవుతుంది. తమ ఆటతీరుతో, తమ క్యారెక్టర్ తో వరల్డ్ వైడ్ కొన్ని కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి ఓ స్టార్ ప్లేయర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ దిగ్గజ ప్లేయర్ సౌరవ్ గంగూలీ. అతడి ఆటని చూడటం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు ఈ దిగ్గజ ఆటగాడు. మరి స్టార్ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా 28 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో దారుణంగా విఫలం అయ్యింది టీమిండియా. దీంతో ఒకే ఒక్క ప్రశ్న బయలుదేరింది. అదేంటంటే? విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడి ఉంటే.. భారత జట్టు కచ్చితంగా గెలిచి ఉండేదని. కాగా.. కోహ్లీ వ్యక్తిగత కారణాల దృష్ట్యా తొలి మ్యాచ్ కు దూరం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు భారత దిగ్గజం, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.

ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్ తో దాదా మాట్లాడుతూ..”విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చూడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అతడి డెడికేషన్ ఆటపై ఉన్న ప్యాషన్ నన్ను మంత్ర ముగ్దున్ని చేశాయి. ఇక విరాట్ ఎప్పుడూ పరుగుల కోసం పరితపిస్తూ ఉంటాడు. కోహ్లీ పరుగుల దాహం తీరనిది. ఇందుకోసం ప్రతీ రోజు కఠోర శ్రమ చేస్తుంటాడు. ఇక గ్రౌండ్ లో విరాట్ ఎలా ఉంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సహచర ఆటగాళ్లలో జోష్ నింపుతూ మైదానంలో వేగంగా కదులుతూ ఉంటాడు” అని గంగూలీ కితాబిచ్చాడు. ప్రస్తుతం దాదా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇదిలా ఉండగా.. ఇంగ్లాండ్ తో జరిగే రెండో టెస్ట్ కు విరాట్ జట్టుతో కలవనున్నాడు. దీంతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ బలపడనుంది. మరి విరాట్ కోహ్లీపై దాదా చేసిన వ్యాఖ్యలు మీకేవిధంగా అనిపించాయో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి