iDreamPost

Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత

టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ భేడీ కన్నుమూశారు. 77 ఏళ్ల వయసులో బిషన్ సింగ్ భేడీ సోమవారం తుదిశ్వాస విడిచారు. బిషన్ సింగ్ మృతిపై క్రికెట్ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు.

టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ స్పిన్నర్ బిషన్ సింగ్ భేడీ కన్నుమూశారు. 77 ఏళ్ల వయసులో బిషన్ సింగ్ భేడీ సోమవారం తుదిశ్వాస విడిచారు. బిషన్ సింగ్ మృతిపై క్రికెట్ లోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ప్రముఖ క్రికెటర్లు సంతాపం తెలియజేశారు.

Bishan Singh Bedi: టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూత

టీమిండియా దిగ్గజ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ కన్నుమూశారు. 77 ఏళ్ల వయసులో సోమవారంనాడు ఆయన తుదిశ్వాస విడిచారు. బిషన్ సింగ్ భేడీ దిగ్గజ స్పిన్నర్ మాత్రమే కాదు.. 22 మ్యాచుల్లో టీమిండియాకి కెప్టెన్ గా వ్యవహరించారు. 1967 నుంచి 1979 సంవత్సరాల మధ్య టీమిండియాకి ప్రాతినిధ్యం వహించారు. టీమిండియాకి ప్రాతినిధ్యం వహించిన దిగ్గజ స్పిన్నర్లలో బిషన్ సింగ్ కూడా ఒకరు. టీమిండియా స్పిన్ విభాగం ఇప్పుడు ఈ స్థాయికి చేరడంలో బిషన్ సింగ్ భేడీ కృషి కూడా ఉంది అంటారు. టీమిండియా మొట్ట మొదటి వన్డే మ్యాచ్ గెలవడంలో.. ఎర్రపల్లి ప్రసన్న, బీఎస్ చంద్రశేఖర్, ఎస్.వెంకటరాఘవన్ తో కలిసి బిషన్ సింగ్ భేడీ కీలక పాత్ర పోషించారు. 1975 వరల్డ్ కప్ లో ఈస్ట్ ఆఫ్రికాను 120 పరుగలకే కట్టడి చేయడంలో బిషన్ సింగ్ భేడీ(12-8-6-1) అద్భుత గణాంకాలు నమోదు చేశారు. కెరీర్ లో మొత్తం 67 టెస్టు మ్యాచులు ఆడిన బిషన్ సింగ్ బేడీ.. 266 వికెట్లు పడగొట్టారు. అలాగే 10 వన్డేల్లో 7 వికెట్లు గిరాటేశారు.

దేశవాళీ క్రికెట్ లో బిషన్ సింగ్ భేడీ ఢీల్లీకి ప్రాతినిధ్యం వహించారు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత పలువురు ఇండియన్ క్రికెటర్లకు కోచ్ గా మెంటర్ గా వ్యవహరించారు. అలాగే క్రికెట్ మ్యాచుల్లో కామెంటేటర్ గా కూడా చేశారు. ఆటకు సంబంధించి తన అభిప్రాయాలను సూటిగా చెప్పే వ్యక్తుల్లో బిషన్ సింగ్ భేడీ కూడా ఒకరు. ఆటకు సంబంధించి తన అభిప్రాయాన్ని ఎలాంటి సంకోచం లేకుండా చెప్పేస్తారు. బిషన్ సింగ్ భేడీ మృతిపై క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. పలువురు దిగ్గజ క్రికెటర్లు బిషన్ సింగ్ భేడీ మృతిపట్ల సంతాపం తెలియజేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి