iDreamPost
android-app
ios-app

ఆసీస్ తో మ్యాచ్.. అర్షదీప్ పై మాక్స్ వెల్ అహంకారం!

  • Author Soma Sekhar Published - 10:35 AM, Wed - 29 November 23

టీమిండియా ఫ్యాన్స్ గ్లెన్ మ్యాక్స్ వెల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నీ దిగజారుడు తనానికి నిదర్శనం అంటూ అతడిపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

టీమిండియా ఫ్యాన్స్ గ్లెన్ మ్యాక్స్ వెల్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది నీ దిగజారుడు తనానికి నిదర్శనం అంటూ అతడిపై సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

  • Author Soma Sekhar Published - 10:35 AM, Wed - 29 November 23
ఆసీస్ తో మ్యాచ్.. అర్షదీప్ పై మాక్స్ వెల్ అహంకారం!

సాధారణంగా క్రికెట్ మ్యాచ్ ల్లో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉంటాయి. గ్రౌండ్ లో ప్లేయర్ల మధ్య గొడవలు, అంపైర్ నిర్ణయాలపై వివాదాలు, బ్యాట్స్ మెన్స్ ని బౌలర్ కవ్వించడాలు.. దానికి బదులుగా బ్యాటర్లు తమ బ్యాట్ తో సమాధానాలు ఇవ్వడాలు క్రికెట్ చరిత్రలో మనం ఎన్నో చూశాం. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అర్షదీప్-మ్యాక్స్ వెల్ మధ్య ఇది జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో.. మ్యాక్స్ వెల్ పై విమర్శలు గుప్పిస్తున్నారు టీమిండి ఫ్యాన్స్. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఆస్ట్రేలియా.. స్లెడ్జింగ్ కు పెట్టింది పేరు. ప్రత్యర్థి ఆటగాళ్లను తమ మాటలతో, చేష్టలతో మనసికంగా దెబ్బకొట్టడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా మరోసారి ఆ విషయాన్ని నిరూపించాడు ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్. సాధారణంగా ఏ బౌలర్ అయినా వికెట్ తీసిన తర్వాత తన ఆనందాన్ని పలు రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇక కొందరి బౌలర్లకు సిగ్నేచర్ స్టెప్పులు ఉండనే ఉంటాయి. ఇదే విధంగా ఆసీస్ బ్యాటర్ ఆరోన్ హార్డీ వికెట్ దక్కించుకున్న టీమిండియా బౌలర్ అర్షదీప్ తన సంతోషాన్ని ఎక్స్ ప్రెస్ చేశాడు.

అయితే ఇది దృష్టిలో పెట్టుకున్న మ్యాక్స్ వెల్ అర్షదీప్ వేసిన ఓవర్ లో సిక్సర్ ద్వారా 28 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అర్షదీప్ ను వెక్కిరిస్తూ.. అతడి స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో టీమిండియా ఫ్యాన్స్ మ్యాక్స్ వెల్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ బౌలర్ అయిన వికెట్ పడితే తన సంతోషాన్ని వ్యక్తం చేస్తాడు.. దానికి నువ్వు ఇంతాలా అతి చేయడం కరెక్ట్ కాదు. ఇది నీ దిగజారుడు తననానికి నిదర్శనం మ్యాక్సీ.. అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. మరి అర్షదీప్ పై మ్యాక్సీ తీరు మీకేవిధంగా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişJojobet GirişCasibomtaraftarium24luxbetluxbetRulobetJojobet GirişkatlaJojobet Giriş