iDreamPost

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా.. పాక్ వరల్డ్ రికార్డు బద్దలు

  • Author Soma Sekhar Published - 08:59 AM, Sat - 2 December 23

ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమిండియా.. పాకిస్థాన్ వరల్డ్ రికార్డును బద్దలు కొడుతూ చరిత్ర సృష్టించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆస్ట్రేలియాపై విజయం సాధించిన టీమిండియా.. పాకిస్థాన్ వరల్డ్ రికార్డును బద్దలు కొడుతూ చరిత్ర సృష్టించింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 08:59 AM, Sat - 2 December 23
IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా.. పాక్ వరల్డ్ రికార్డు బద్దలు

ఆస్ట్రేలియాతో జరుగుతున్న కీలక మైన నాలుగో టీ20లో టీమిండియా 20 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ గెలుపుతో సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుని వరల్డ్ కప్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. ఇక ఈ గెలుపు ద్వారా దాయాది దేశమైన పాకిస్థాన్ రికార్డును బద్దలు కొడుతూ.. ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకుంది టీమిండియా. మరి భారత్ బద్దలు కొట్టిన ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాయ్ పూర్ వేదికగా ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్ లో టీమిండియా 20 రన్స్ తో కంగారూ టీమ్ ను చిత్తుచేసింది. ఇక ఈ విజయంతో క్రికెట్ చరిత్రలో సరికొత్త అధ్యాయనానికి నాంది పలికింది. పాకిస్థాన్ ప్రపంచ రికార్డును బద్దలు ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా టీమిండియా క్రికెట్ హిస్టరీతో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో అత్యధిక విజయాలు సాధించిన టీమ్ గా భారత్ అవతరించింది. ఇప్పటి వరకు టీమిండియా 213 టీ20 మ్యాచ్ ల్లో 136 విజయాలను అందుకుంది. ఈ రికార్డు ఇంతకు ముందు పాకిస్థాన్ పేరిట ఉండేది. పాక్ 226 మ్యాచ్ ల్లో 135 విజయాలు సాధించింది. తాజా విజయంతో పాక్ వరల్డ్ రికార్డును బద్దలు కొట్టింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. జట్టులో జైస్వాల్(37), రుతురాజ్(32) పరుగులు చేయగా రింకూ సింగ్ మరోసారి తనదైన ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అతడు కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. ఇక హార్డ్ హిట్టర్ గా పేరుగాంచిన జితేశ్ శర్మ(35) మెరుపులు మెరిపించాడు. ఆసీస్ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ 3, బెహ్రెండార్ఫ్, సంగా తలా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో7 వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితం అయ్యింది. జట్టులో కెప్టెన్ మాథ్యూ వేడ్(36) టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు తీసి సత్తాచాటగా.. దీపక్ చహర్ రెండు వికెట్లు పడగొట్టాడు. మరి టీమిండియా పాక్ వరల్డ్ రికార్డును బద్దలు కొడుతూ.. నయా చరిత్ర లిఖించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి