iDreamPost
android-app
ios-app

సిరీస్‌ మధ్యలో వెళ్లి.. ఓ ఇంటివాడైన టీమిండియా క్రికెటర్‌!

  • Author Soma Sekhar Published - 01:01 PM, Wed - 29 November 23

టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీ మధ్యలోనే వెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఓ టీమిండియా క్రికెటర్. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ టోర్నీ మధ్యలోనే వెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఓ టీమిండియా క్రికెటర్. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

  • Author Soma Sekhar Published - 01:01 PM, Wed - 29 November 23
సిరీస్‌ మధ్యలో వెళ్లి.. ఓ ఇంటివాడైన టీమిండియా క్రికెటర్‌!

ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ తో టీమిండియా ఆటగాళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఈ సిరీస్ లో భారత జట్టు 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా సిరీస్ మధ్యలో వెళ్లి పెళ్లి చేసుకున్నాడు ఓ టీమిండియా ప్లేయర్. బీహార్ కు చెందిన తన చిన్న నాటి ఫ్రెండ్ ను వివాహం ఆడాడు ఈ ఆటగాడు. ఇక ఈ వేడుకుకు పలువురు భారత క్రికెటర్లు హాజరైయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో తన అద్భుతమై బౌలింగ్ తో అదరగొట్టాడు టీమిండియా నయా సంచలనం ముకేశ్ కుమార్. తొలి రెండు మ్యాచ్ ల్లో ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయడంలో ముకేశ్ విజయవంతం అయ్యాడు. ఇక మూడో మ్యాచ్ కు అతడు అందుబాటులో లేడు. దానికి రీజన్ ఏంటంటే? ముకేశ్ కుమార్ ఓ ఇంటివాడైయ్యాడు. బీహార్ కు చెందిన తన చిన్ననాటి స్నేహితురాలు దివ్య సింగ్ మెడలో ముకేశ్ కుమార్ మూడు ముళ్ళు వేశాడు. గోరఖ్ పూర్ లో ఓ హోటల్ లో మంగళవారం ఘనంగా వీరి పెళ్లి జరిగింది. ఇక వీరి వివాహ వేడుకకు పలువురు టీమిండియా క్రికెటర్లు హాజరైయ్యాడు.

కాగా.. డిసెంబర్ 4న గోరఖ్ పూర్ లోనే ముకేష్-దివ్యల రిసెప్షన్ జరగనుంది. అయితే 3వ టీ20 మ్యాచ్ కు ముకేష్ అందుబాటులో ఉండడు అన్న విషయాన్ని ముందే వెల్లడించింది బీసీసీఐ. మళ్లీ తిరిగి శుక్రవారం రాయ్ పూర్ వేదికగా జరిగే 4వ టీ20 మ్యాచ్ కు ముందు జట్టుతో కలవనున్నాడు. తొలి రెండు టీ20ల్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ కొత్త పెళ్లి కొడుకు నెక్ట్స్ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తాడో వేచి చూడాలి. ఇక వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఈ కొత్త జంటకు ప్రముఖులు, నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ముకేశ్ కుమార్ ఈ సంవత్సరమే టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేయడం విశేషం. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్ తో జరిగిన వన్డే, టెస్టు, టీ20 సిరీస్ ల్లో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాడు.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş