iDreamPost

విద్యార్థిని క్లాస్ మేట్‌తో కొట్టించిన టీచర్..! ఎందుకంటే..?

విద్యార్థిని క్లాస్ మేట్‌తో కొట్టించిన టీచర్..! ఎందుకంటే..?

దేశం సర్వమత సమ్మేళనం. ఏ మతం ఎక్కువ కాదూ, ఏ మతం తక్కువ కాదూ. మనకు ఇష్టమైన దైవాన్ని పూజించే హక్కు ఉంది. అయితే తమ మతమే గొప్ప అని, ఇతర మతాన్ని, దేవుళ్లను కించపరుస్తూ మాట్లాడటం సరికాదు. దీని వల్ల ఇబ్బందులను ఎదుర్కొక తప్పదు. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఆ మంటల్లో చలికాచుకోవడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిపోతుంది. అయితే ఇప్పటి వరకు రాజకీయాలకే పరిమితమైన ఈ విన్యాసం.. ఇప్పుడు చిన్నపిల్లలపై కూడా ముద్రించేందుకు సిద్దం అవుతున్నాయి పాఠశాలలు. అందరూ సమానమే చెప్పాల్సిన ఉపాధ్యాయుడు.. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించి.. కటకటాల పాలయ్యాడు. ఇంతకు అసలేం జరిగిందటే..?

ఉత్తరప్రదేశ్ సంభాల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ పాఠశాల టీచర్.. పిల్లలపై మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టేందకు ప్రయత్నించాడన్న ఆరోపణలపై అరెస్టు అయ్యాడు. అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దుగావార్ గ్రామంలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలోని ఉపాధ్యాయుడు.. ఓ స్టూడెంట్‌ను లేపి ప్రశ్న వేయగా.. అతడు చెప్పకపోవడంతో.. తోటి క్లాస్ మేట్ అయిన ముస్లిం విద్యార్థినితో చెంప దెబ్బ కొట్టమని ఆదేశించాడు. ముస్లిం బాలుడు.. హిందూ బాలుడు చెంపపై కొట్టాడు. దీంతో పిల్లవాడు స్కూల్ కు వెళ్లడం మానేయడంతో తండ్రి ప్రశ్నించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇద్దరు పిల్లల మధ్య మతపరమైన ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు క్లాస్ టీచర్ ప్రయత్నించాడని, దీని వల్ల తన కుమారుడి మత పరమైన మనో భావాలు దెబ్బతిన్నాయని పేర్కొంటూ.. హిందూ విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా..షైస్తా అనే ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి.. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గతంలో యుపీలో ముజఫర్ నగర్ లో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. హోం వర్క్ చేయని కారణంగా ముస్లిం బాలుడ్ని తోటి విద్యార్థులతో ఓ మహిళా ఉపాధ్యాయురాలు చెంపదెబ్బలు కొట్టించిన వీడియో అప్పట్లో వైరల్ కావడంతో పాటు పెను సంచలనమైన సంగతి విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి