iDreamPost

సొంత ఎంఎల్ఏ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిపోయిందా ?

సొంత ఎంఎల్ఏ దెబ్బకు చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిపోయిందా ?

అవును మీరు చదివింది కరెక్టే. ఇంత పెద్ద ప్రమాదం జరిగినపుడు చంద్రబాబునాయుడు ఊరికే కూర్చునే రకం కాదన్న విషయం అందరికీ తెలిసిందే. బాధితులను ఆదుకనే విషయంలో చంద్రబాబు ప్రత్యక్షంగా చేసేదేమీ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ళు వేయటంలో మాత్రం ముందుంటాడు. బహుశా ఇప్పుడు కూడా అదే చేసేవాడేనేమో. కానీ సొంత ఎంఎల్ఏనే చంద్రబాబుకు అవకాశం లేకుండా చేశాడు.

ఇంతకీ విషయం ఏమిటంటే విశాఖపట్నం నగరంలోని టిడిపి పశ్చిమ ఎంఎల్ఏ గణబాబు యంత్రాంగం పనితీరును అభినందించాడు. ప్రమాద వార్త వినగానే యంత్రాంగం మొత్తం సకాలంలో స్పందించిందని మెచ్చుకున్నాడు. బాధితులను ఆసుపత్రుల్లో చేర్చటంలో ఫైర్ సిబ్బందితో పాటు పోలీసు, రెవిన్యు, వైద్య ఆరోగ్య సిబ్బంది అందరూ బాగా కష్టపడినట్లు ప్రశంసించాడు. సొంత ఎంఎల్ఏనే ప్రభుత్వం స్పందించిన తీరును మెచ్చుకున్నాక ఇక చంద్రబాబుకు రాళ్ళు వేయటానికి అవకాశం దక్కలేదు.

మామూలుగా చంద్రబాబు నైజం ఎలాగుంటుందంటే ఎదుటి వాళ్ళమీద రాళ్ళేయటమే టార్గెట్ గా పెట్టుకుంటాడు. అధికారంలో ఉంటే ప్రతిపక్షాలను తిడతాడు. అదే ప్రతిపక్షంలో ఉంటేనేమో ప్రభుత్వం ఫెయిలైందంటూ గోల చేస్తాడు. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు గడచిన పదిమాసాల్లో రుజువైంది కూడా. భారీ వర్షాలు కురుస్తున్నపుడు బాధితులకు సాయం చేయలేదన్నాడు. వర్షాల కారణంగా ఇసుక కొరతున్నపుడు కొరతను ప్రభుత్వమే సృష్టించిందన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు చిత్రాలు చాలానే ఉన్నాయి.

కాబట్టి గ్యాస్ లీకేజి లాంటి సీరియస్ వ్యవహారాన్ని చంద్రబాబు వదిలేస్తాడని అనుకునేందుకు లేదు. పైగా తాను అర్జంటుగా విశాఖపట్నం వెళ్ళాలని అందుకు అనుమతులు ఇవ్వాలంటూ కేంద్రప్రభుత్వాన్ని రిక్వెస్టు కూడా చేసుకున్నాడు. కేంద్రం సానుకూలంగా స్పందించిందే అనుకుందాం. అక్కడికి వెళ్ళి చంద్రబాబు ఏమి చేస్తాడు. బాధితులను పరామర్శల పేరుతో ఆసుపత్రుల్లో కాసేపు డ్రామాలాడుతాడు. తర్వాత గ్యాస్ లీకైన ఫ్యాక్టరీని సందర్శించే పేరుతో హడావుడి చేస్తాడు. ఒకవైపు కరోనా వైరస్ నియంత్రణకు యంత్రాంగం ఇబ్బందులు పడుతున్న సమయంలోనే చంద్రబాబు నానా హంగామా చేసేస్తాడు.

అంతా చేసి చివరకు ప్రభుత్వాన్ని తప్పుపడతాడనటంలో సందేహమే లేదు. కానీ ఇపుడు చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. గ్యాస్ లీకేజీకి ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఇది పూర్తిగా యాజమాన్యం తప్పిదమే అని అందరికీ తెలుసు. ఇదే సమయంలో బాధితులకు నష్టపరిహారం విషయంలో జగన్ ఎవరూ ఊహించని రీతిలో ప్రకటన చేయటంతో ప్రతిపక్షాల నోళ్ళు కూడా మరి లేవటం లేదు. అయినా సరే ఎక్కడో బొక్కలు వెతుక్కుని జగన్ పై నాలుగు రాళ్ళు వేయటానికే ప్రయత్నిస్తాడు. అయితే ఆ అవకాశం లేకుండా సొంత పార్టీ ఎంఎల్ఏ గణబాబే తమ అధినేతకు గండికొట్టేశాడు. దాంతో చంద్రబాబు మైండ్ బ్లాంక్ అయిపోయిందనే చెప్పాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి