iDreamPost

అక్కడ ఓడిపోయినా టీడీపీలో తప్పని వర్గపోరు

అక్కడ ఓడిపోయినా  టీడీపీలో తప్పని వర్గపోరు

స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా అనంతపురం జిల్లా తెలుగుదేశంలోని జెసి దివాకర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య విభేదాలు మళ్ళీ మరోసారి భగ్గుమన్నాయి. తాజాగా అనంతపురం నగర పాలక సంస్థ ఎన్నికల్లో తాను సూచించినవారికి కొన్ని కార్పొరేటర్‌ స్థానాలు కేటాయించాలని అనంతపురం తెలుగుదేశం పార్లమెంట్ ఇన్‌చార్జ్ జేసీ పవన్‌ కుమార్ రెడ్డి పట్టుబట్టాడు. అయితే ఆదే పార్టీకి చెందిన అనంతపురం అర్బన్‌ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి మాత్రం జెసి పవన్ సూచించిన వారికి బి-ఫారం ఇచ్చే ప్రసక్తేలేదని జిల్లా నాయకత్వానికి తెగేసి చెప్పినట్లు సమాచారం. ఈ విషయంలో అవసరమైతే తానూ రాజీనామాకు సైతం వెనుకాడేదిలేదని ప్రభాకర్ చౌదరి తెగేసి చెప్పాడని తెలుస్తుంది.

అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీచేసిన సందర్భంలో ఎమ్మెల్యే అభ్యర్థికంటే తనకే అధికంగా ఓట్లు వచ్చాయని, ఈ నేపథ్యంలో పార్టీలో పనిచేస్తున్న తన వర్గీయులకు కనీసం 12 కార్పొరేటర్‌ స్థానాలైనా ఇవ్వాలని జేసీ పవన్‌ జిల్లా నాయకత్వాన్ని కోరిన నేపథ్యంలో ఆ రెండువర్గాల మధ్య టికెట్ల లొల్లి ముదిరి పాకాన పడింది. ఇప్పటికే మొన్నటి ఎన్నికల్లో అనంతపురం టౌన్ తో పాటు జిల్లాలో ఘోర ఓటమిని మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ తాజా వివాదంతో ఏమి పాలుపోక తలపట్టుకుంది. అయితే ఈవిషయంలో చేసేదేమిలేక చివరికి ఈ సమస్యని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా పార్టీవర్గాలు పేర్కొంటున్నాయి.

మున్సిపల్‌ ఎన్నికలకు నామినేషన్లదాఖలు చెయ్యాడానికి శుక్రవారం అఖరు రోజు కావడంతో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల వరికే సమయం ఉండడంతో దాదాపు 15 చోట్ల జెసి దివాకరరెడ్డి వర్గం, ప్రభాకర్ చౌదరి వర్గాలు రెండూ పోటాపోటిగా నామినేషన్ల వేశారు. అదీకాక నాలుగైదు స్థానాలను పొత్తు లో భాగంగా మిత్రపక్షమైన సిపిఐ కి కేటాయించాల్సిరావడం తో ఈ అంశం ఇప్పుడు తెలుగుదేశానికి తలనొప్పిగా మారింది .

నామినేషన్ల ఉపసంహరణ కి రెండు రోజులు గడువు వుండడం తో ఈలోపు పార్టీ నిర్ణయించిన అభ్యర్థులకు మాత్రమే బీ-ఫారం లు ఇవ్వాల్సిరావడంతో బీ ఫాం ఎవరికిస్తే ఎవరు అలుగుతారో అని పార్టీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ ఈ వివాదం సామారస్యంగ పరిష్కరించలేని పక్షంలో పార్టీలో రెండు వర్గాలుగా చీలిపోవడంతోపాటు.. ఎన్నికల్లో నష్టపోయే అవకాశాలుంటాయనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది.

అనంతపురం టౌన్ లో ఈ రెండు వర్గాల వివాదాలు కొత్తకాదు. గత 6 ఏళ్లుగా జేసీ ప్రభాకర్ చౌదరి వర్గాల మధ్య విభేదాలు 2019 ఎన్నికల నాటికి తారా స్థాయికి చేరుకోవడం తో పార్టి పరువు కాస్తా బజారునపడినా వీరిలో ఇప్పటికీ ఏమాత్రం మార్పు రాకపోవడం గమనార్హం.

ఆప్పట్లో చంద్రబాబు హయంలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప రాణి పై కమిషనర్ లపై జెసి దివాకర్ రెడ్డి పలుమార్లు బహిరంగంగానే తీవ్రస్థాయిలో ఆరోపణలకు దిగారు. అయితే నగరంలో తాము చేస్తున్నా అవినీతి ని చూడలేకే తమకు కులపిచ్చి బందుప్రీతి అంటూ ఆరోపించారు. ఒకదశలో అనంతపురం అభివృద్ధి కి కొంత మంది దెయ్యం లా అడ్డుపడుతున్నారని మేయర్ స్వరూప రాణి ని ఉద్దేశించి దివాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే ఆయన వ్యాక్యల పై ఘాటుగా స్పందించిన మేయర్ స్వరూప రాణి జేసీ దివాకరరెడ్డి తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఆమె ఎదురుదాడి చేశారు. భీష్ముడి లా ఉండాల్సిన ఆయన అనంతపురానికి శకుని లా తయారయ్యారని అప్పట్లో ఆమె సంచలన ఆరోపణలు చేశారు.

అప్పట్లో అధికారపార్టీలో ఎంపీ ఎమ్మెల్యేల మధ్య రాజకీయ రగడ అనంతపురాన్ని కుదిపేసింది.
రహదారుల విస్తరణ పై ఇద్దరిది తలో దారి. నగరంలో రహదారుల విస్తరణ చేపట్టాల్సిందేనని జెసి అప్పట్లో నగర పాలక సంస్థ ముందు నిరాహర దీక్ష కూడా చేసాడు. అలాగే ఒక ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవం ప్రోటోకాల్ విషయంలో కూడా వీరి మధ్య విభేదాలు తలెత్తాయి.

ఇరు వర్గాల మధ్య ఈ తాజా విబేధాల నెపధ్యంలో గత ఎన్నికల ఘోర ఓటమి నుండి అనంతపురం తెలుగుదేశం నేతలు ఏమాత్రం గుణపాఠం నెర్చుకోలేదని, ఇలాంటి నేతల తీరుతో పార్టీ పరువు మరోసారి బజారున పడిందని సగటు తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి