iDreamPost

విచారణ వద్దంటున్న ధూళిపాళ్ల..! సువర్ణ అవకాశం చేజార్చుకుంటున్నారా..?

విచారణ వద్దంటున్న ధూళిపాళ్ల..! సువర్ణ అవకాశం చేజార్చుకుంటున్నారా..?

తప్పు జరిగితే వ్యవస్థలు స్పందిస్తాయి.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దానికి తన మాన బేధం ఉండదు. టిడిపి నాయకుడు ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాత్రం తన పై వచ్చిన ఆరోపణలు, సంగం డైరీ లో జరిగిన అవకతవకలు మీద సమాధానం చెప్పాల్సింది పోయి, తన మీద విచారణ వద్దని హైకోర్టు కు వెళ్ళడం ఇప్పుడు ఆయన నైతికత, నిబద్ధత నే ప్రశ్నించేలా కనిపిస్తోంది.

ప్రభుత్వం ఒకరి మీద కేసు పెట్టినపుడు ఆ విచారణ ఎలా ఎదుర్కోవాలి? వచ్చిన ఆరోపణలకు ఎలా సమాధానం చెప్పాలి అనే విషయాలు మీద దృష్టి నిలపాలి. కేసు నమోదు చేసి నేరారోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తనపై మోపబడిన ఆరోపణలకు సమాధానం చెప్పాలి. ప్రాథమిక సాక్ష్యాధారాలు, నేరానికి తగిన ఆరోపణలు లేకుండానే ప్రభుత్వాలు ఏ వ్యక్తి మీద నేరాన్ని మోపవు. అందులోనూ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ మీద సంగం డైరీ లో జరిగిన అవకతవకలు మీద అవినీతి నిరోధక శాఖ మోపిన నేరారోపణల తీవ్రంగా ఉన్నాయి. డైరీ చైర్మన్ గా కొనసాగుతున్న నరేంద్రకుమార్ ఈ ఆరోపణలకు తగిన సమాధానం చెప్పాల్సింది పోయి, జరిగిన అవకతవకలకు సరైన లెక్కలు చెప్పి అవినీతి నిరోధక శాఖకు సహకరించకుండా ఇప్పుడు హైకోర్టుకు వెళ్లారు. విచారణ సరికాదు అని, దాన్ని నిలిపివేయాలని, కేసు కొట్టేయాలని కోరడంలో మతలబు ఏమిటో అర్థం కావడం లేదు.

Also Read : బాబు మాట్లాడకపోయినా.. బుచ్చయ్య చౌదరి బిజెపిని కడిగేశారు..!

తెలుగుదేశం పార్టీ నాయకులకు ఈ మధ్య కాలంలో ఏకంగా విచారణ నిలిపివేయాలని కోరడం అలవాటుగా మారింది. గతం లో అమరావతి భూముల విషయం దగ్గర నుంచి ఈ పద్ధతి కొనసాగుతూ వస్తోంది. ఏదైనా ఆరోపణ లేదా నేరానికి తగిన విమర్శలు వచ్చినప్పుడు దాన్ని నిరూపించుకోవాల్సి ఉంది పోయి ప్రతిసారి హై కోర్టు మెట్లు ఎక్కి తమపై పడిన విచారణను నిలుపుదల చేయాలని కోర్టును అభ్యర్థించడం అలవాటుగా టిడిపి నాయకులు చేసుకున్నారు. తమపై పడ్డ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది పోయి న్యాయపరంగా కోర్టు వద్దకు వెళ్లి విచారణకు పూర్తిగా ఆపుకొనే టిడిపి నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారు.

సంగం డైరీలో అక్రమాలు జరగలేదు, తాను అవకతవకలకు పాల్పడలేదనే నమ్మకం ధూళిపాళ్లకు ఉంటే.. ధైర్యంగా విచారణను ఎదుర్కొనే వారు. ఇలా విచారణ ఎదుర్కొనడం ద్వారా ప్రస్తుతం టీడీపీ నేతలు చేస్తున్నట్లు.. ఇవి కక్షపూరితంగా పెట్టినవని నిరూపించుకోవచ్చు. ప్రజల దృష్టిలో ప్రభుత్వాన్ని దోషిగా నిలపవచ్చు. పోలీసులు, ఏసీబీ, సీఐడీ సహా ఇతర విచారణ సంస్థలు ప్రభుత్వాల చేతిలో కీలుబొమ్మలుగా పని చేస్తున్నాయని కూడా నిరూపించవచ్చు. ఇదే జరిగితే ప్రభుత్వానికి భారీ నష్టం వాటిళ్లుతుంది. ప్రతిపక్షానికి ప్రజల మద్ధతు భారీగా పెరుగుతుంది. మరి ఇలాంటి మహత్తరమైన అవకాశాన్ని టీడీపీ సీనియర్‌నేత ధూళిపాళ్ల ఎందుకు అందిపుచ్చుకోవడంలేదో అర్థం కావడం లేదు. విచారణే వద్దు.. కేసు కొట్టేయండి అంటే.. తప్పు చేయనప్పుడు విచారణకు భయపడాల్సిన అవసరం ఏముందనే ఆలోచన ప్రజల్లో కలుగుతుంది. విచారణ నుంచి తప్పించుకున్నా.. ప్రజా కోర్టు మాత్రం దోషిగా నిర్థారిస్తుంది.

Also Read : కోర్టుకెళ్తే పోయేదానికి కుల రాజకీయమెందుకు..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి