iDreamPost

వాలంటీర్లపై నాటుసారా తయారీ ఆరోపణలా ?

వాలంటీర్లపై నాటుసారా తయారీ ఆరోపణలా ?

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్ధపై తెలుగుదేశంపార్టీ నేతలు బురద చల్లేస్తున్నారు. ఈ వ్యవస్ధ వల్ల జగన్ కు ఎక్కడ మంచిపేరు వస్తుందో అన్న ఆందోళనతో మొదటి నుండి టిడిపి ఈ వ్యవస్ధను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరూ చూస్తున్నదే. తాజాగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకటరావు మాట్లాడుతూ వాలంటీర్లే నాటుసారా తయారు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయటమే ఆశ్చర్యంగా ఉంది.

కరోనా సంక్షోభం నేపధ్యంలో వాలంటీర్ల పనితీరు అందరి ప్రశంసలు అందుకుంటోంది. మొదట పేదలకు పెన్షన్ అందిస్తుంటే వాలంటీర్ల ద్వారానే కరోనా వ్యాప్తి చెందుతోందని చంద్రబాబునాయుడు ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. తర్వాత రేషన్ సరుకులను షాపులకే వచ్చి తీసుకోమని లబ్దిదారులకు చెబితే వాలంటీర్ల ద్వారా ఇళ్ళకే సరుకులను అందించాలంటూ ఇదే చంద్రబాబు డిమాండ్ చేశాడు. ఇదే పద్దతిలో వాలంటీర్లపై టిడిపి నేతలు నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.

ప్రతిపక్షాలు ఏమి ఆరోపణలు చేస్తున్నా జగన్ పట్టించుకోలేదు. దాంతో చివరకు వాలంటీర్లు నాటుసారా తయారు చేస్తున్నారంటూ తాజాగా ఆరోపణలకు దిగారు. అంటే వాలంటీర్ల పనితీరుపై అన్నీ వైపుల నుండి ప్రశంసలు వస్తుంటే టిడిపి తట్టుకోలేక పోతోందనటానికి ఇదే నిదర్శనం. జగన్ ఇమేజిని ఎలాగైనా దెబ్బ తీయాలన్న ఏకైక లక్ష్యంతోనే చంద్రబాబు అండ్ కో పనిచేస్తున్న విషయం బయటపడిపోతోంది.

ఇక మద్యం షాపులు తెరవటంపై కూడా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. గ్రీన్, ఆరంజి జోన్లలో మద్యంషాపులు తెరుస్తుండంపై కూడా గోల చేస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారమే దేశమంతా మద్యం షాపులు తెరుచుకుంటున్నాయి. ఇందులో భాగంగానే ఏపిలో కూడా షాపులు ఓపెన్ అవుతుంటే టిడిపి గోలేమిటో అర్ధం కావటం లేదు. ప్రజల ప్రాణాల కన్నా జగన్ కు మద్యం ఆదాయమే ముఖ్యమా ? అంటూ పిచ్చి ప్రశ్నలు మొదలుపెట్టారు.

పదో తరగతి పరీక్షలను నిర్వహించలేకపోయినందుకు విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని మరో ఎంఎల్ఏ అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. ప్రధానమంత్రి లాక్ డౌన్ ప్రకటన కారణంగానే దేశంలో మొత్తం పరీక్షల వాయిదా పడిన విషయం తెలిసి కూడా టిడిపి ఎంఎల్ఏ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాడంటే టిడిపి విజ్ఞతే బయటపడుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి