iDreamPost

జనసేనకు భారీ షాకిచ్చిన చంద్రబాబు.. ఆ రెండు సీట్లలో కూడా టీడీపీనే పోటీ?

TDP, Janaesna: టీడీపీ జనసేనను దారుణంగా మోసం చేస్తుందని వైసీపీ నేతలతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారి మాటలకు నిజమనేలా నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతున్న ఓ రెండు స్థానాల విషయంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

TDP, Janaesna: టీడీపీ జనసేనను దారుణంగా మోసం చేస్తుందని వైసీపీ నేతలతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వారి మాటలకు నిజమనేలా నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా జనసేన పోటీ చేస్తుందని ప్రచారం జరుగుతున్న ఓ రెండు స్థానాల విషయంలో టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

జనసేనకు భారీ షాకిచ్చిన చంద్రబాబు.. ఆ రెండు సీట్లలో కూడా టీడీపీనే పోటీ?

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే ఒంటరిగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో టీడీపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేయనున్నాయి. ఇటీవలే 118 స్థానాలతో ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. కేవలం 24 స్థానాల్లోనే జనసేన కూటమి పోటీ చేయనుంది. ఇలా ఏపీ రాజకీయాలు సాగుతున్న క్రమంలో ఓ విషయంలో జనసేనకు టీడీపీ గట్టి షాకిచ్చినట్లు తెలుస్తోంది.

2024లో ఏపీలో జరగనున్న సార్వత్రిగా ఎన్నికల్లో టీడీపీ, కూటమి పోటీ చేయనుంది. అలానే బీజేపీని కూడా కలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే టీడీపీ, జనసేన కూటమి 118 స్థానాలకు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. ఇదే సమయంలో జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీచేస్తుందని  ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. 24 స్థానాల్లో కూడా కేవలం 5 స్థానాలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించారు. అలానే మిగిలిన 19 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

ఇదే సమయంలో జనసేన పోటీ చేస్తున్న స్థానాల సంఖ్యపై ఆ పార్టీ శ్రేణుల్లో నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. జనసేన పోటీ చేయనున్న మిగిలిన 19 స్థానాలు ఇవే అంటూ పలు నియోజవర్గాల పేర్లు పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోన్నాయి. అలా జనసేనకు కేటాయిస్తున్న రెండు స్థానాల్లో టీడీపీ ఇన్ ఛార్జీలను నియమించింది.  వైఎస్సార్ కడప జిల్లాలోని రైల్వే కోడూరు, ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజవర్గంలో జనసేన పోటీ చేస్తుందని సమాచారం. అందుకే ఇప్పటికే ఆ నియోజవర్గాల్లో జనసేనా కేడర్ విస్తృత్తంగా పని చేసుకుంటూ వెళ్తోంది. ఇదే సమయంలో తాజాగా టీడీపీ..జనసేనకి గుట్టి షాకిచ్చింది.

ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ నియోజకవర్గానికి గోరంట్ల రవికుమార్‌, రైల్వేకోడూరు నియోజకవర్గానికి ముక్కా రూపానందరెడ్డిని ఇంఛార్జ్‌లుగా నియించారు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శి అసెంబ్లీ టికెట్ పొత్తులో భాగంగా జనసేన పార్టీకి కేటాయిస్తారని ప్రచారం జరిగింది. ఎన్నారై గరికపాటి వెంకట్‌కు జనసేన తరపున టికెట్ ఖాయమని టాక్ వినిపించింది. ఆయన కూడా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ప్రకాశం జిల్లాలో ప్రముఖ విద్యా సంస్థల యజమాని గోరంట్ల రవికుమార్‌‌ను దర్శి నియోజవర్గానికి సమన్వయకర్తగా టీడీపీ నియమించడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇలా టీడీపీ ఇన్ ఛార్జీని నియమించిన నేపథ్యంలో దర్శి టికెట్ ఎవరికి కేటాయిస్తారనే ఉత్కంఠ మొదలైంది. అలానే కడప జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గం కూడా జనసేనకు కేటాయిస్తారని చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా అక్కడ కూడా టీడీపీ సమన్వయకర్తను మార్చేసింది. ఇప్పటి వరకు ఇంఛార్జ్‌గా వ్యవహరించిన కస్తూరి విశ్వనాథనాయుడి స్థానంలో ముక్కా రూపానందరెడ్డిని ఇన్ ఛార్జీగా నియమించింది. మొత్తానికి ఈ రెండు సీట్లు జనసేనకు వెళ్తాయని భావించగా.. తాజాగా టీడీపీ ఇంఛార్జ్‌లను నియమించడం జనసేనకు షాకిచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి