iDreamPost

రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న డీఐజీ!

రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న డీఐజీ!

తమిళనాడులో విషాదం చోటు చేసుకుంది. డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్న విజయ్ కుమార్ అనే పోలీస్ ఆఫీసర్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు కన్నీటి సంద్రంలో మునిగిపోయారు. ఉద్యోగంలో ఎంతో పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్న విజయ్ కుమార్ ఉన్నట్టుండి బలవన్మరణానికి పాల్పడడంతో పోలీస్ శాఖలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన విజయ్ కుమార్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత గ్రూప్-1 పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు డీఎస్పీగా పని చేశారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలోనే విజయ్ కుమార్ కోయంబత్తురు డీఐజీ ( డిప్యూటీ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ) గా కూడా ఎన్నికయ్యారు. ఇకపోతే, విజయ్ కుమార్ గత కొంత కాలం నుంచి కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తుంది. అయితే, జూలై 6న రాత్రి జరిగిన ఓ పుట్టిన రోజు వేడుకలకు కూడా హాజరయ్యారు విజయ్ కుమార్.

ఇక మరుసటి రోజు తెల్లవారుజామున ఇంట్లోనే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని విజయ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ అధికారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత అతడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ కుమార్ మరణవార్త తెలుసుకున్నఅతని కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే అంశం ఇప్పుడు తమిళనాడులో తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి