iDreamPost

ఇకపై వారందరికీ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: స్టాలిన్

ఇకపై వారందరికీ  ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు: స్టాలిన్

పుట్టిన వాడు మరణించక తప్పదు. అయితే పుట్టుక ఎలా ఉన్న మరణం ఎప్పుడు సంభవిస్తుందో చెప్పలేం. చాలా మంది తమ మరణం ఇలా ఉండాలని కోరుకుంటారు. మంచాన పడకుండా, నిద్రలోనే ప్రాణం విడవాలని ఆశిస్తుంటారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా తన చివరి మజిలీ సాగిపోవాలని భావిస్తుంటారు. దహన సంస్కారాలు వీరి చేతుల మీదుగా సాగాలని అనుకుంటారు. అయితే ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగే అంతిమ సంస్కారాలు గౌరవ ప్రదంగా ఉంటాయి.  చాలా తక్కువ మంది ప్రముఖులకు మాత్రమే ఆ అవకాశం లభిస్తుంది. దేశానికి, రాష్ట్రానికి వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి మాత్రమే ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు. అయితే తమిళనాడు ప్రభుత్వం .. ఈ అంతిమ సంస్కారాల విషయంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

తమిళనాడులో ఎంకె స్టాలినే నేతృత్వంలోని డీఎంకె ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రజాదరణను చూరగొంటుంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అవయవదానం చేసిన వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ అవయవ దానం ద్వారా వందలాది మంది రోగులకు జీవితాన్ని అందించడం ద్వారా రాష్ట్రం, దేశానికి మార్గ దర్శకంగా నిలిచిందని అన్నారు. అవయవ దానంలో తమిళనాడు దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. విషాద పరిస్థితుల్లో కూడా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవదానానికి ముందుకు వచ్చిన కుటుంబ సభ్యుల నిస్వార్థ త్యాగాల వల్లే ఇది సాధ్యమైందని స్టాలిన్ పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి