iDreamPost
android-app
ios-app

AL Vijay: ప్రముఖ దర్శకుడిపై యువకుడి దాడి.. కారు ఆపి మరీ..

ఈ మధ్య కాలంలో సినిమా సెలెబ్రిటీల మీద దాడులు చేస్తున్న సంఘటనలు బాగా పెరుగుతున్నాయి. విజయ్‌ ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది.

ఈ మధ్య కాలంలో సినిమా సెలెబ్రిటీల మీద దాడులు చేస్తున్న సంఘటనలు బాగా పెరుగుతున్నాయి. విజయ్‌ ఘటన మరువక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది.

AL Vijay: ప్రముఖ దర్శకుడిపై యువకుడి దాడి.. కారు ఆపి మరీ..

తమిళ దర్శకుడు ఎఎల్‌ విజయ్‌ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన తీసిన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ సక్సెస్‌ అవుతూ వస్తున్నాయి. హీరోయిన్‌ అమలాపాల్‌తో వివాహం తర్వాత ఆయన పేరు రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మరింత పాపులర్‌ అయింది. విజయ్‌, అమలాపాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు. 2014, జూన్‌ 12 వీరి పెళ్లి జరిగింది. అయితే, వీరి కాపురం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. రెండేళ్లలోనే మనస్పర్థల కారణంగా విడిపోయి దూరంగా ఉన్నారు.

తర్వాత 2017 ఫిబ్రవరి నెలలో విడాకులు తీసుకున్నారు. అయితే, అమలాపాల్‌తో విడాకుల తర్వాత విజయ్‌ రెండో పెళ్లి చేసుకున్నారు. డాక్టర్‌ ఆర్‌ ఐశ్వర్యను వివాహం ఆడారు. వీరికి 2020లో ఓ బాబు కూడా పుట్టాడు. ఇక, అసలు విషయానికి వస్తే.. విజయ్‌పై తాజాగా ఓ యువకుడు దాడికి పాల్పడ్డాడు. ఆయన కారుకు అడ్డుగా రావటమే కాకుండా.. ఆయనపైకి దాడికి యత్నంచాడు. ఈ సంఘటన చెన్నైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..

విజయ్‌ తన మేనేజర్‌ మణిశర్మ, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌తో కలిసి చెన్నైలోని ఓ బిజీ రోడ్డులో తన కారులో వెళుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ చోట విజయ్‌ కారుకు ఓ వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దీంతో విజయ్‌ కారును ఆపాడు. అయితే, కారుకు అడ్డుగా వచ్చిందే కాకుండా విజయ్‌పైనే దాడికి యత్నించాడు ఆ వ్యక్తి. కారుపై దాడి చేశాడు. హెల్మెట్‌తో పలు సార్లు కారుపై కొట్టాడు. ఈ ఘటనలో మేనేజర్‌ మణిశర్మకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఇక, ఈ సంఘటనపై విజయ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విజయ్‌ కారుపై దాడికి పాల్పడ్డ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు సదరు వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న విజయ్‌ కాంత్‌ అంత్యక్రియల సందర్భంగా కూడా ఓ విచారకర సంఘటన జరిగింది.

విజయ్‌కాంత్‌కు నివాళులు అర్పిస్తున్న ఇళయ దళపతి విజయ్‌పై ఓ వ్యక్తి చెప్పు విసిరేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్‌ మడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటనపై విజయ్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతర హీరోల ఫ్యాన్స్‌ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి, దర్శకుడు విజయ్‌పై ఓ వ్యక్తి దాడి చేసిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

jojobet girişJojobet GirişEnbet Girişivermectin tabletPusulabetPusulabetMadridbetmeritbetCasibom GirişmeritbetjojobetTophillbetmarsbahis girişJojobet GirişJojobet GirişcasibomHoliganbetCasibom Giriş