ఉత్తరప్రదేశ్ (యూపీ) ఎన్నికల్లో ఘనవిజయం సాధించి, రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజీపీ సిద్ధమైంది. బీజేపీ యూపీ రథసారధి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పార్టీ పెద్దలతో సమావేశం అయ్యేందుకు ఢిల్లీలో మకాం వేశారు. ఆదివారం ప్రధాని మోడీతో దాదాపు గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్చు సహా ఇతర అంశాలు వారిద్దరి మధ్య చర్చకు వచ్చాయి. ఈ భేటీ తర్వాత ప్రధాని మోడీ యోగిని ఉద్దేశించి ‘‘భవిష్యత్‌లో యూపీని యోగీ సరికొత్త అభివృద్ధి […]
ఎన్నికల సమయంలోనూ, ఎన్నికలు అయిపోయి ఫలితాలు వచ్చిన తర్వాత బీఎస్పీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి వ్యవహరిస్తున్న తీరు హాస్యాస్పదంగా ఉంది. అన్ని పార్టీలు ప్రజా తీర్పును గౌరవిస్తూ.. ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటామని, ప్రజల తరఫున మరింతగా పోరాడతామని ప్రకటనలు చేస్తుంటే.. మాయావతి మాత్రం తమ ఓటమికి మీడియానే కారణమంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మీడియా దుష్ప్రచారం చేయడం వల్లే ముస్లింలు బీఎస్పీకి దూరమయ్యారని, లేకుంటే బీజేపీని అడ్డుకునేవాళ్లమంటూ ఎన్నికలు అయిపోయాక నిమ్మలంగా చెబుతున్నారు. ఆడలేక మద్దెలఓడు.. మాయావతి […]
గ్రాండ్ ఓల్డ్ పార్టీగా, కొన్ని దశాబ్దాలపాటు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన పార్టీగా ఎంతో ఘనచరిత్ర కలిగిన కాంగ్రెసు క్రమంగా పాతాళానికి దిగజారిపోతోంది. కేంద్రంలో అధికారానికి రెండు విడతలు దూరమైన ఆ పార్టీ రాష్ట్రాల్లోనూ ప్రాభవం కోల్పోతోంది. ఎన్నికలు జరుగుతున్నప్పుడల్లా ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వస్తోంది. పునర్వైభవం కోసం ఎంత ప్రయత్నిస్తుంటే అంతగా పతనం అవుతోంది. తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే కాంగ్రెస్ పరిస్థితే దారుణం. అంతర్గత కలహాలతో పంజాబ్ లో ఉన్న […]
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో వివిధ మీడియా, సర్వే సంస్థలు అంచనా వేసి చెప్పాయి. దాదాపు అన్ని సంస్థలు బీజేపీనే గెలుస్తాయని చెప్పాయి. గతంకన్నా బీజేపీకి కొన్ని సీట్లు తగ్గుతాయని, ఎస్పీకి మరికొన్ని సీట్లు అదనంగా వస్తాయని అంచనా వేశాయి. బీజేపీకి 250–280 మధ్య, ఎస్పీకి 100–130 మధ్య సీట్లు వస్తాయని పేర్కొన్నాయి. ఇక బీఎస్పీ, కాంగ్రెస్‌ల పరిస్థితి ఎప్పటి మాదిరిగానే ఉందని తెలిపాయి. బీఎస్పీ 15–20, కాంగ్రెస్ 5–10 సీట్లు గెలుచుకుంటుందని సర్వే […]
ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బీజేపీ వ్యతిరేక పార్టీలకు నిరాశను కలిగించాయి. ఉత్తరప్రదేశ్‌తోపాటు, ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాలలో మళ్లీ బీజేపీనే అధికారం వరించబోతోందని దాదాపు అన్ని సర్వే సంస్థలు అంచనా వేశాయి. పంజాబ్‌లో ఆప్, గోవాలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని పేర్కొన్నాయి. పంజాబ్‌లో బీజేపీ బలంగా లేదు. ఆ రాష్ట్రంలపై కమలం పార్టీ ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. ఐదు రాష్ట్రాలలో అతి ముఖ్యమైన ఉత్తరప్రదేశ్‌పైనే బీజేపీ నేతలు ఎక్కువగా ఫోకస్ చేశారు. […]
దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తించిన ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ రోజు చివరిదైన ఏడో దశ పోలింగ్ మొదలైంది. ఈ దశలో 53 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 613 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ దశలో ప్రధాని మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ, మళ్లీ అధికారంలోకి […]
భారతదేశ రాజకీయాల్లో ఆమె ఒక సంచలనం. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రానికి తొలి దళిత ముఖ్యమంత్రిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అలాంటి మహిళా నేత.. ప్రస్తుతం జరుగుతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రజలకు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఆమె ఎవరో కాదు మాజీ ముఖ్యమంత్రి, బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత మాయావతి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చివరిదశకు వచ్చాయి. మొత్తం ఏడు దశల ఎన్నికలకుగాను మార్చి 3వ తేదీతో ఆరుదశల పోలింగ్ పూర్తయింది. ఈ నెల 7వ తేదీన […]
ఉత్తరప్రదేశ్లో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్న బీజేపీకి.. విజయం అంత సులువుగా దక్కదనే అభిప్రాయాలు ఎన్నికల ముందు నుంచి ఉన్నాయి. గత నెలలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు దశల ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ రోజు ఆరో దశ పోలింగ్ జరుగుతోంది. ఈ దశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు బీజేపీపై బాంబ్ పేల్చారు విశ్వహిందూ పరిషత్ మాజీ కార్యనిర్వాహఖ అధ్యక్షుడు ప్రవీణ్ తొగాడియా. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీకి […]
దేశంలో అతి కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు పరిస్థితి దాదాపు ప్రశాంతంగానే ఉంది. తొలి ఐదు దశల పోలింగ్ చిన్నపాటి ఘటనలు మినహా హింసకు తావు లేకుండానే జరిగింది. కానీ ఆరో దశ పోలింగుకు ముందు హింస, ఉద్రిక్తతలు చెలరేగాయి. మాజీమంత్రి, సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి అయిన స్వామి ప్రసాద్ మౌర్య కాన్వాయ్ పై బీజేపీ వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. మాజీమంత్రి వాహనాన్నే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. […]