తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ప్రతి రౌండ్లోనూ వైసీపీయే ముందంజలో కొనసాగుతూ వచ్చింది. టీడీపీ, బీజేపీ అభ్యర్థులు రెండు, మూడు స్థానాలకే పరిమితం అయ్యారు. ఒక్కటంటే ఒక్క రౌండ్లోనూ రెండు పార్టీలూ ఆధిక్యతను చూపలేకపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మధ్యాహ్నాం వెల్లడైన ఫలితాలను బట్టే తీవ్ర నిరాశతో టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికెళ్లిపోయారని వార్తలు కూడా వచ్చాయి. చివరకు వైసీపీ అభ్యర్థి […]
తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో గెలుపుపై అధికార వైసీపీ ఆది నుంచి ధీమాగా ఉంది. మెజారిటీపైనే ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. టీడీపీ, బీజేపీలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పోరాడాయి. అయితే తిరుపతి ఫలితం ఎలా ఉంటుందో టీడీపీ అనుకూల మీడియాకు ముందే తెలుసని తాజాగా జరిగిన ఓ ఘటన ద్వారా అర్థమవుతోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఓ చర్చను చేపట్టింది. […]