iDreamPost

లెక్కింపునకు ముందే తిరుపతి ఫలితాన్ని తేల్చిన టీడీపీ అనుకూల మీడియా

లెక్కింపునకు ముందే తిరుపతి ఫలితాన్ని తేల్చిన టీడీపీ అనుకూల మీడియా

తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో గెలుపుపై అధికార వైసీపీ ఆది నుంచి ధీమాగా ఉంది. మెజారిటీపైనే ఆ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. టీడీపీ, బీజేపీలు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా పోరాడాయి. అయితే తిరుపతి ఫలితం ఎలా ఉంటుందో టీడీపీ అనుకూల మీడియాకు ముందే తెలుసని తాజాగా జరిగిన ఓ ఘటన ద్వారా అర్థమవుతోంది.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగియడంతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఈ రోజు రాత్రి ఏడు గంటలకు ఓ చర్చను చేపట్టింది. ఇందులో ఆయా రాష్ట్రాలు, నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారని ప్రోమో వేసిన సదరు మీడియా.. తిరుపతి ఉప ఎన్నికలపై మాత్రం.. వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుంది..? అంటూ పేర్కొంది. లెక్కింపునకు ముందే టీడీపీకి అత్యంత అనుకూలంగా ఉండే ఏబీఎన్‌ తిరుపతి ఫలితాన్ని తేల్చడం విశేషం.

తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్సీపీ, టిడిపి, బిజెపిలు ప్రధానంగా తలపడ్డాయి. గత ఎన్నికల్లో నాలుగు లక్షల పైగా ఓట్లు సాధించిన టిడిపి అభ్యర్థి పనబాక లక్ష్మి మళ్లీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రజల నుంచి ఆమెకు మద్దతు రాలేదు అన్నది సుస్పష్టం. అలాగే ఎంపీగా గెలిచి రెండు సంవత్సరాలు సైతం తిరక్కుండానే మృతిచెందిన బల్లి దుర్గాప్రసాద్ మరణం తాలూక సానుభూతి, ప్రభుత్వ సంక్షేమ ఫలాల మీద ప్రజల మద్దతు బలంగా ఉండడం గమనించిన టిడిపి వైసీపీ విజయాన్ని ఎప్పుడో ఊహించింది.

అయితే దాని తర్వాత వైసీపీ విజయానికి పూర్తిగా ఆ పార్టీ క్రెడిట్ కి వదిలేస్తే టిడిపికి మరింత ఇబ్బంది తప్పదని భావించిన తెలుగుదేశం పార్టీ నేతలు దొంగ ఓట్ల నాటకం ఆడినట్లు అర్థమవుతోంది. అధికార పార్టీ భారీగా దొంగ ఓట్లు వేయించుకుంది అన్న సంకేతాన్ని ప్రజల్లోకి పంపి దాని ద్వారా టిడిపి మీద సానుభూతి కలిగించే ప్రయత్నం, పార్టీ ప్రతిష్ట మీద ఓటమి భారం పడకుండా చూసే ప్రయత్నం లో భాగమే దొంగ ఓట్ల నాటకంగా అర్థమవుతుంది.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన అన్ని ఎన్నికల్లోనూ పూర్తిగా డీలా పడిన తెలుగుదేశం పార్టీ తిరుపతి లాంటి కీలకమైన నియోజకవర్గం ఉప ఎన్నికల్లో కనీసం ప్రభావం చూపకపోతే ఆ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో టీడీపీ నేతలే భారీ స్కెచ్ తో దొంగ ఓట్ల నాటకం ఆడినట్లు అర్థమవుతోంది. అందుకే ఇప్పుడు తాపీగా వైసిపి ఓటమిని ఒప్పుకుంటూనే, మెజారిటీ మీద కొత్త లెక్కలు కొత్త భాష్యాలు చెప్పేందుకు సిద్ధం అవుతున్నారు. ఏది ఏమైనా తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ వార్ వన్ సైడ్ గా పనిచేసింది, ఓట్లు రాబట్టింది అన్నది టీడీపీ మీడియా ద్వారానే బయటపడుతున్న సత్యం. అయితే ఈ ఓటమిని ఎవరి భుజాలు మీద వేయాలి, లేదా అధికార పార్టీ క్రెడిట్ ఎలా తీయాలి అనే దానిపై టీడీపీ దృష్టి పెట్టె అవకాశం ఉంది.

Also Read : టీడీపీలో సీనియర్లకు లోకేష్ ఎసరు..! అప్పటి పాపం ఇప్పుడు పండింది..!!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి