iDreamPost
android-app
ios-app

సౌతాఫ్రికా దెబ్బకు చిత్తుగా ఓడి.. చెత్త రికార్డ్ నెలకొల్పిన శ్రీలంక!

  • Published Jun 04, 2024 | 7:24 AM Updated Updated Jun 04, 2024 | 7:24 AM

T20 World Cup 2024: పొట్టి ప్రపంచ కప్ లో సౌతాఫ్రికా ఘన విజయంతో బోణీ కొట్టింది. శ్రీలంకను చిత్తుగా ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో ఘోర ఓటమి చవిచూసిన లంక.. రెండు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

T20 World Cup 2024: పొట్టి ప్రపంచ కప్ లో సౌతాఫ్రికా ఘన విజయంతో బోణీ కొట్టింది. శ్రీలంకను చిత్తుగా ఓడించింది. అయితే ఈ మ్యాచ్ లో ఘోర ఓటమి చవిచూసిన లంక.. రెండు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

సౌతాఫ్రికా దెబ్బకు చిత్తుగా ఓడి.. చెత్త రికార్డ్ నెలకొల్పిన శ్రీలంక!

టీ20 వరల్డ్ కప్ 2024లో సౌతాఫ్రికా ఘనంగా బోణీ కొట్టింది. న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ప్రోటీస్ బౌలర్లు నిప్పులు చెరగడంతో.. లంక బ్యాటర్లు విలవిలలాడారు. నిప్పులు చెరిగే బంతులతో సౌతాఫ్రికా బౌలర్లు లంక బ్యాటర్లను పెవిలియన్ కు క్యూ కట్టించారు. అన్రిచ్ నోర్ట్జే, కేశవ్ మహరాజ్, రబాడలు అద్భుత బౌలింగ్ తో రాణించడంతో.. లంక కేవలం 77 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 78 పరుగుల స్వల్ప టార్గెట్ ను 4 వికెట్లు కోల్పోయి 16.2 ఓవర్లలో ఛేదించింది. ఈ క్రమంలోనే శ్రీలంక రెండు చెత్త రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూయార్క్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంక ప్రోటీస్ బౌలర్ల ధాటికి 77 రన్స్ కే కుప్పకూలింది. జట్టులో 19 పరుగులు చేసిన కుశాల్ మెండిస్ టాప్ స్కోరర్ గా నిలిచాడంటేనే అర్దమవుతోంది ప్రత్యర్థి బౌలర్లు ఏ రేంజ్ లో రాణించారో. అన్రిచ్ నోర్ట్జే  తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 7 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించాడు. అతడికి తోడు రబాడ, కేశవ్ మహరాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 78 పరుగుల సింపుల్ టార్గెట్ ను సౌతాఫ్రికా జట్టు కాస్త కష్టంగానే ఛేదించింది. 16.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను పూర్తి చేసింది. డికాక్(20), క్లాసెన్(19*) పరుగులతో రాణించారు. ఇక ఈ మ్యాచ్ లో శ్రీలంక రెండు చెత్త రికార్డులను నమోదు చేసింది. అవేంటంటే? టీ20 వరల్డ్ కప్ లో పవర్ ప్లేలో అత్యల్ప స్కోర్ ను నమోదు చేసి.. తమ రికార్డును తామే సమం చేసుకున్నారు. ఈ మ్యాచ్ లో పవర్ ప్లే(తొలి 6 ఓవర్ల)లో వికెట్ నష్టానికి కేవలం 24 రన్స్ మాత్రమే చేసింది. తద్వారా 2022లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో కూడా పవర్ ప్లేలో సేమ్ 24 రన్సే చేసి.. 4 వికెట్లు కోల్పోయింది. ఇక మరో చెత్త రికార్డ్ ఏంటంటే? శ్రీలంక టీమ్ తన టీ20 చరిత్రలోనే 10 ఓవర్లలో అత్యల్ప స్కోర్ ను నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో 10 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 40 రన్స్ మాత్రమే చేసి.. వరస్ట్ రికార్డును నమోదు చేసింది. దాంతో ఒకే మ్యాచ్ లో రెండు చెత్త రికార్డులు తన పేరిట లిఖించుకున్న టీమ్ గా శ్రీలంక నిలిచింది. మరి లంక ఈ వరస్ట్ రికార్డులు క్రియేట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom Girişmeritbetbetvoleİmajbet güncel girişcasibomgalabetJojobetHoliganbetJojobet GirişJojobet GirişCasibomjojobetjojobetcasibomcasibomjojobetJojobet