iDreamPost
android-app
ios-app

వీడియో: దూబేకు రోహిత్ స్పెషల్ ట్రైనింగ్.. పాండ్యాను పక్కన పెట్టడానికేనా?

  • Published May 31, 2024 | 4:45 PM Updated Updated May 31, 2024 | 4:45 PM

కెప్టెన్ రోహిత్ శర్మ యంగ్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు ప్రాక్టీస్ లో భాగంగా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ కనిపించాడు. చాలా సేపు అతడితో మాట్లాడాడు. దాంతో హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టే ప్లాన్ లో భాగంగానే రోహిత్ అతడిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాడా? అన్న అనుమానం అందరిలో కలుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కెప్టెన్ రోహిత్ శర్మ యంగ్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు ప్రాక్టీస్ లో భాగంగా స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ కనిపించాడు. చాలా సేపు అతడితో మాట్లాడాడు. దాంతో హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టే ప్లాన్ లో భాగంగానే రోహిత్ అతడిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నాడా? అన్న అనుమానం అందరిలో కలుగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

వీడియో: దూబేకు రోహిత్ స్పెషల్ ట్రైనింగ్.. పాండ్యాను పక్కన పెట్టడానికేనా?

టీ20 వరల్డ్ కప్ 2024ను సాధించుకోనే ఇండియాకు తిరిగిరావాలని అమెరికాలో అడుగుపెట్టారు టీమిండియా ఆటగాళ్లు. అందుకు తగ్గట్లుగానే ప్రాక్టీస్ మెుదలుపెట్టారు. న్యూయార్క్ వాతావరణం అలవాటు పడేందుకు గంటల కొంది నెట్స్ లో ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ వీడియోలో శివమ్ దూబేకు స్పెషల్ గా ట్రైనింగ్ ఇచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ వీడియో వైరల్ కావడంతో.. హార్దిక్ పాండ్యా ప్లేస్ కు ఎసరుపెట్టడానికే దూబేకు ట్రైనింగ్ ఇచ్చి.. టీమ్ లో స్థానాన్ని సుస్థిరపరచాలని రోహిత్ చూస్తున్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియా యంగ్ పేస్ ఆల్ రౌండర్ శివమ్ దూబేను సానబెట్టి హార్దిక్ పాండ్యా ప్లేస్ కు ఎసరు పెట్టడానికి కెప్టెన్ రోహిత్ శర్మ ప్లాన్స్ వేస్తున్నాడు అని నెటిజన్లు ఎప్పటి నుంచో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఆ ప్రణాళికలను రోహిత్ చిన్న చిన్నగా అమలు పరుస్తున్నట్లుగా కనిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ కోసం న్యూయార్క్ లో అడుగుపెట్టిన టీమిండియా కఠోరంగా శ్రమిస్తోంది. నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను స్టార్ స్పోర్ట్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ వెలుగులోకి వచ్చింది.

ప్రాక్టీస్ లో భాగంగా యంగ్ ప్లేయర్, స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు ప్రత్యేకంగా బ్యాటింగ్ లో మెళకువలు నేర్పాడు రోహిత్. బ్యాటింగ్ లో స్పెషల్ గా షాట్స్ ఎలా కొట్టాడు దూబేకు వివరించాడు. చాలా సేపు దూబేతో రోహిత్ మాట్లాడాడు. అతడిని నిఖార్సైన ఆల్ రౌండర్ గా తీర్చిదిద్దే ప్లాన్ లో ఉన్నాడు హిట్ మ్యాన్. వీడియోలో ఈ సీన్ వైరల్ గా మారాడంతో.. రోహిత్ మాస్టర్ ప్లాన్ తోనే దూబేకు ట్రైనింగ్ ఇస్తున్నాడని సగటు క్రికెట్ అభిమానులు ఆరోపిస్తున్నారు. చిన్నచిన్నగా దూబేను టీమ్ లో సుస్థిరపరిచి.. పాండ్యాను సైడ్ చేయాలని రోహిత్ ప్లాన్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హిట్టర్ గా ఐపీఎల్ లో సూపర్ సక్సెస్ అయిన దూబేకు వరల్డ్ కప్ లో చోటు దక్కింది. ఇదిలా ఉండగా.. ప్రాక్టీస్ లో భాగంగా మెుదట ఫీల్డింగ్ పై ఫోకస్ పెట్టి.. క్యాచ్ లు ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత బ్యాటింగ్ ను ప్రాక్టీస్ చేశారు. చాహల్, బుమ్రాలు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం విశేషం. మరి నిజంగానే పాండ్యా ప్లేస్ కు ఎసరు పెట్టడానికి రోహిత్.. దూబేను సానబెడుతున్నాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabetcasibomjojobetcasibomjojobetpokerklasmadridbetjojobetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetHiltonbetGrandpashabetjojobetjojobet girişcasibomcasibomgrandpashabetmarsbahis giriş